Post: #1

మహి గారు నమస్తే,

నేను html లో ఒక వెబ్ సైట్ డిజైన్ చేస్తున్నాను. దానికి ఇమేజెస్ తో Rollover మెనూ కావాలి. మోడల్స్ క్రింద ఇస్తున్నాను.

img2

ఈమోడల్స్ ఫొటోషాప్ లో డిజైన్ చేసాను. వెబ్ సైట్ స్టార్ట్ చేసినప్పుడు మెనూ మెదటి ఇమేజిలాగా ఉంటుంది. మెనూ మీద మౌస్ Rollover చేసినప్పుడు రెండో ఇమేజిలాగా అవ్వాలి. మౌస్ Rollover చెయ్యకపోతే మెనూ మెదటి ఇమేజిలాగానే ఉండాలి. కోడ్ కాని మరేదైనా కాని html, dreamweaver లకు సంబంధించినవే అయి ఉండాలి. దీని గురించిన సమాచారం ఎంత తొందరగా నాకు చెప్పగలిగితే అంతమంచిది. ప్లీజ్ ఎవరైనా చెప్పండి.


Post: #2
మెనూ బటన్స్ ని వేరు వేరుగా ఉపయోగిస్తే టేబుల్ ఎలిమెంట్లలో అమర్చడం , మౌస్ ఓవర్ చేంజ్ సులువు అవుతాయి

అంటే హోమ్ బటన్ మొదలు [Image: 25oyzcp.jpg] గాను , మౌస్ ఓవరు లో [Image: 2vvkx9k.jpg] గాను ఉంటుంది !!

ఈ బటన్ల ఇమేజిల కొలతలు ఒకే రకంగా ఉంటే ఎఫెక్ట్ చక్కగా ఉంటుందని మీకు తెలిసినదే !

కోడింగు కోసం నిపుణుల సలహాకై వేచి ఉండండి Smile ఉదాహరణకై అటాచిమెంట్ చూడండి


Attached File(s)
.zip  roll-over.zip (Size: 4.21 KB / Downloads: 15)

Post: #3

రామకృష్ణ గారు,

మీరు ఇచ్చిన ఇమేజెస్ నుపయోగించి మీరడిగిన విధంగా డ్రీమ్ వేవర్ లో చేశాను. అది కూడా అర్జెంట్ గా అన్నారు కాబట్టి. ఇది కేవలం మీకు కోడ్ తెలుసుకోవడం కొరకు ఉపయోగపడొచ్చు. మీరు psd original files ఇస్తే ఇంకా ఫైన్ ట్యూన్ చేయవచ్చు. కింది అటాచ్ మెంట్ లో మీరు ప్రాజెక్ట్ ను డౌన్లోడ్ చేస్కొని మీకు నచ్చిన విధంగా మార్చుకోండి. డ్రీమ్ వేవర్ లో నేను టేబుల్స్ ఉపయోగించడం జరిగింది. అదే డివిజన్ లు ఉపయోగించిన యెడల ఇంకొక స్టైల్ షీట్ ఫైల్ అదనంగా యాడ్ చేయవలసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇది మీకు కొంతవరకు ఉపయోగపడుతుందనుకుంటున్నాను.

Note: ఈ కోడ్ కంటే preloaded images అనే జావాస్క్రిప్ట్ ఫంక్షన్ నుపయోగించి సైట్ ఓపెన్ అయిన వెంటనే మౌస్ ఓవర్ ఉపయోగించే విధంగా కూడా చేయవచ్చు. కానీ దానికి కొంచెం టైం పడుతుంది. త్వరలోనే వాటి గురించి వివరంగా మరియొక పోస్టులో తెలియజేస్తాను.

Link: You are not allowed to view links. Register or Login to view.

Another Note: నేను mn48 గారి సమాధానాన్ని ముందుగా చూడలేకపోయాను. ఇప్పుడే చూశాను. తను కూడా అతి తక్కువ సమయంలో మంచి కోడ్ నే తెలియజేయగలిగారు. అయితే బ్యాండ్ విడ్త్ తక్కువగా ఉన్న సర్వర్స్ కు ఇమేజెస్ ను ముందుగా లోడ్ చేసిన తర్వాత సైట్ ఓపెన్ అయ్యే విధంగా మరో జావాస్క్రిప్ట్ కోడ్ ఉంది. ఇప్పుడు బిజీగా ఉండడం వలనతెలియజేయలేకపోతున్నాను. త్వరలో మీకు తెలియజేస్తాను. ఆ కోడ్ తో నేను చేస్తున్న సైట్ లింక్ క్రింది చూడండి. ఆ సైట్ మీద రైట్ క్లిక్ చేసి View Source క్లిక్ చేసి మీరు కోడ్ ను గమనించవచ్చు. ఇందులో నేవిగేషన్ బటన్స్ కు ఇచ్చిన కోడ్ అదే. థాంక్స్ mn48 గారు.

You are not allowed to view links. Register or Login to view.Attached File(s)
.zip  Site.zip (Size: 110.01 KB / Downloads: 9)

[Image: mahi_sig.jpg]

Post: #4

మహిగారు, mn48 గార్లకు నమస్తే,

ముందుగా నా ఈ సందేహానికి వెంటనే సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములు.

mn48 గారు అతి తక్కువ సమయంలో మంచి కోడ్ చెప్పారు. మహిగారు మీరు ఇచ్చిన ఫైల్ కూడా చాలా బాగుంది. వీటిని వెంటనే వినియోగించుకుంటాను. మీరు టేబుల్స్ ఉపయోగించినా నాకు ఇబ్బంది ఏమీలేదు. మీరు "psd original files ఇస్తే ఇంకా ఫైన్ ట్యూన్ చేయవచ్చు" అన్నారు కాబట్టి psd original files పంపుతున్నాను. దానిని కూడా చేసిపెట్టండి. దానితోపాటు నాకు ఈ ఫైల్ css style sheet కూడా ఉంటే కావాలి.

Quote:ఈ కోడ్ కంటే preloaded images అనే జావాస్క్రిప్ట్ ఫంక్షన్ నుపయోగించి సైట్ ఓపెన్ అయిన వెంటనే మౌస్ ఓవర్
ఉపయోగించే విధంగా కూడా చేయవచ్చు. అయితే బ్యాండ్ విడ్త్ తక్కువగా ఉన్న సర్వర్స్ కు ఇమేజెస్ ను ముందుగా లోడ్
చేసిన తర్వాత సైట్ ఓపెన్ అయ్యే విధంగా మరో జావాస్క్రిప్ట్ కోడ్ ఉంది.

నేను వీటికోసం కూడా ఎదురు చూస్తాను.


Post: #5
రామకృష్ణ గారు,

కొంచెం బిజీగా ఉన్నాను. త్వరలో మీరు అడిగినట్లుగా చేసి ఇస్తాను. Smile

[Image: mahi_sig.jpg]

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)