Post: #1

మహి గారు నమస్తే

ముందుగా నా పోస్టు "Rollover మెనూ క్రియేషన్ గురించి సందేహం..." లో మీరు, mn48 గారు చెప్పిన సొల్యూషన్స్ చక్కగా వినియోగపడ్డాయి. డ్రీమ్ వేవర్ లో టేబుల్స్ ఉపయోగించి మీరు ఇచ్చిన దానిని నేను డివిజన్ లు,  స్టైల్ షీట్ ఉపయోగించి చక్కని వెబ్ సైట్ క్రియోట్ చేసాను. ఇందుకు ధన్యవాదములు. మీరు psd original files ఇస్తే ఇంకా ఫైన్ ట్యూన్ చేయవచ్చు అన్నారు. నేను psd original files ఇచ్చాను కదా. దానికోసం ఎదురుచూస్తున్నాను.

Quote:

ఈ కోడ్ కంటే preloaded images అనే జావాస్క్రిప్ట్ ఫంక్షన్ నుపయోగించి సైట్ ఓపెన్ అయిన వెంటనే మౌస్ ఓవర్ ఉపయోగించే విధంగా కూడా చేయవచ్చు. అయితే బ్యాండ్ విడ్త్ తక్కువగా ఉన్న సర్వర్స్ కు ఇమేజెస్ ను ముందుగా లోడ్ చేసిన తర్వాత సైట్ ఓపెన్ అయ్యే విధంగా మరో జావాస్క్రిప్ట్ కోడ్ ఉంది. 

అని కూడ చెబుతూ... నేను కొంచెం బిజీగా ఉన్నాను. త్వరలో మీరు అడిగినట్లుగా చేసి ఇస్తాను అన్నారు దానికోసం కూడా ఎదురుచూస్తున్నాను.

ఇంతేకాకుండా నాకు నేను పంపిన psd original files లోని బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లాంటి మాడల్ ఇమేజెస్, అందులోని మెనూస్ కి ఉన్న ఇమేజెస్ లాంటి కలర్ ఫుల్ న్యాచురల్ టైప్ మాడల్ ఇమేజెస్ కావాలి. వీటిలో Astrology కి సంబంధించినవి కొన్నయినా తప్పనిసరిగా ఉండాలి. Astrology కి సంబంధించినవి కాకుండా వేరేవి కూడా ఉండచ్చు. వీటితోపాటు Astrology కి సంబంధించిన వెబ్ సైట్ టెంప్లేట్ మాడల్స్ కూడా కావాలి.

అలాగే "Complete free professional website registration & making" అనే మీ పోస్టులో వర్డ్ ప్రెస్, ద్రూపాల్ మరియు జూమ్లా వంటి కంటెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్స్ గురించి పోస్టు చేస్తాను అన్నారు. దాని గురించి ఎదురుచూస్తున్నాను.

వీలయినంత తొందరలో వీటన్నిటి గురించిన సమాచారం ఇస్తారని ఆశిస్తున్నాను.

Quote this message in a replyReply

Post: #2
రామకృష్ణ గారు,

ధన్యవాదములు.

*మేము మీ వద్ద నుండి psd ఫైల్స్ అడిగినది.. కేవలం మౌస్ ఓవర్ చేసినపుడు బటన్ చుట్టూ వచ్చే గ్లో వరకు మాత్రమే తీస్కొని, జూమ్ చేద్దామన్న ఉద్దేశ్యంతోనే. మీరు ఇచ్చిన gif ఫైల్ లో లేయర్స్ అన్నీ మెర్జ్ అయి ఉంటాయి కాబట్టి బటన్స్ యొక్క విడి విడి లేయర్స్ కోసం అలా అడిగాము. అయితే మాకు సమయం కుదిరినపుడు మాత్రమే మేము ఇవన్నీ చేసి ఇవ్వగలము. మీకు ఆల్రెడీ కోడ్ మీద అవగాహన ఉంది కాబట్టి మీరు కొంచెం శ్రమ తీస్కుని, ఇవన్నీ చేయగలరనుకుంటున్నాము. మొదటగా మీరు ప్రయత్నించి మీకు సాధ్యం కానివి మాత్రమే ఫోరమ్ లో ప్రశ్నించగలరు.

*మీకు కావలసిన Astrology సంబంధిత చిత్రాలను మొదట You are not allowed to view links. Register or Login to view. ద్వారా కానీ, పికాసా, ఫోటోబకెట్ లాంటి ఇతర ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ ల ద్వారా శోధించండి. తప్పని సరిగా లభిస్తాయి.

*మీరు అడిగిన కంటెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్స్ లో ఆల్రెడీ వర్డ్ ప్రెస్ గురించి గతంలోనే పోస్టు చేయబడినది. ద్రూపాల్, జూమ్లా గురించి మాత్రమే పోస్ట్ చేయవలసి ఉంది.

వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ లింక్: You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3

మహి గారు

మొదట అడిగిన వెంటనే సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదములు.

* "Rollover మెనూ క్రియేషన్ గురించి ... నేను ఆల్రెడీ "Rollover మెనూ క్రియేట్ చేసేసాను. మీరు ఇంకా ఏమైనా బెటర్ సజెషన్ ఇస్తారేమో అని మాత్రమే దీని గురించి అడిగాను.

* నాకు కావలసిన Astrology సంబంధిత చిత్రాలను మీరు చెప్పినవిధంగా మొదట You are not allowed to view links. Register or Login to view. ద్వారా కానీ, పికాసా, ఫోటోబకెట్ లాంటి ఇతర ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ ల ద్వారా శోధిస్తాను.

* మీరు ఇచ్చిన కంటెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్స్ లో ఆల్రెడీ వర్డ్ ప్రెస్ గురించి పోస్టు నేను ఇదివరకే చూసాను. మిగిలిన  ద్రూపాల్, జూమ్లా గురించి ఎదురుచూస్తాను.

Quote this message in a replyReply

Post: #4
sir meeru icchina wordpress installation installation link panicheyadam ledu.
Quote this message in a replyReply

Post: #5
రామన్ గారు,

వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ పోస్ట్ యొక్క లింక్ సరిచేయబడింది. ఈ క్రింది లింక్ లో చూడగలరు.

You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)