Post: #1

మహి గారు నమస్తే

ఫొటోషాప్ లో మెర్జ్ అయిన రెండో ఇమేజి తొలగించడం ఎలా? అంటే ఒక ఇమేజి మీద కొద్దిగా ఉండే ఇమేజి కాని అక్షరాలు కాని వాటిని తొలగించాలి. ఉదాహరణ కోసం మాత్రమే క్రింద ఒక ఇమేజి ఇస్తున్నాను.

పై ఇమేజిలో "కృష్ణం వందే జగద్గురుమ్" అనే అక్షరాలు ఉన్నాయి. వాటిని తొలగించినా ఇమేజి పాడవకుండా ఉండాలన్నమాట. అంటే కృష్ణుడి కాళ్ళు, మెడలోదండ వాటిస్థానాలలో అవి పూర్తిగా కనిపించాలి

దీని గురించి సమగ్రంగా చెబితే అందరికీ ఉపయోగపడుతుంది కదా అని నా అభిప్రాయం.

Quote this message in a replyReply

Post: #2
కేవలం అక్షరాలని / లోగోలని తొలగించాలంటే Photoinstrument ఉపయోగించి చూడండి

[Image: mod01.jpg]

ఇక ఫోటోషాప్ ట్యుటోరియలు కోసం [subscribe=4826]నేనూ ఎదురుచూస్తాను[/subscribe] Smile

కాపీరైట్స్ కోసం watermarks చేర్చిన ఇమేజిలను మార్చుకుని ఉపయోగించకూడదు సుమా !!
Quote this message in a replyReply

Post: #3

mn48 గారు

అడిగిన వెంటనే ఇంత చక్కని సొల్యూషన్ అందించినందుకు మీకు ధన్యవాదములు. అసలు నాకు ఇలాంటి సాఫ్ట్ వేర్ ఒకటి ఉంటుందని ఇప్పటివరకు తెలియదు. ఇలాంటి మంచి విషయాలను పరిచయం చేస్తున్న మన ఫోరం అడ్మినిస్ట్రేటర్ మహి గారికి, ఫోరం సక్సెస్ ఫుల్ నడవడంలో తమవంతు పాత్ర పోషిస్తున్న అడ్మిన్ బృందానికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఇలాగే మంచి మంచి విషయాలను పరిచయం చేస్తూ సాంకేతిక బ్లాగులలో ధృవతారగా నిలిచి పోవాలని ఆకాంక్షిస్తున్నాను.

ఇకపోతే నేను అడిగిన విషయం కాపీరైట్స్ కోసం watermarks చేర్చిన ఇమేజిలను మార్చుకుని ఉపయోగించడానికి మాత్రం కాదు.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)