Post: #1

సబ్యులందరికి నమస్కారం,

passport  లోని పుట్టిన తేదిని మార్చడానికి ప్రొసీజర్ ఏమిటి? 10th క్లాసు మేమోలోని పుట్టిన తేదిని passport లో సవరించాలనుకుంటున్నాను.

Raju

Dubai

Quote this message in a replyReply

Post: #2

గౌడ్ గారు!


మీరు ఈ సారి ఇండియా వెల్లినపుడు e seva కేంద్రాల్లో గాని లేదా డైరెక్ట్ గా పాస్ పోర్ట్ ఆఫిస్ కు గాని వెళ్ళండి. తాత్కాల్ లో మీరు మీ పుట్టిన తేదీ వివరాలను మార్చుకోవచ్చు అక్కడి నియమాలను అనుసరించి-తగిన సమాచారపు డక్యుమెంట్లను సబ్మిట్ చేసి.

నేను ఈ క్రీంది వెబ్ సైట్ లో చూసాను కాని కరెక్ట్ సమాచారం దొరకలేదు, ఒక్కసారి మీరు కూడా చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

అలాగే మీకు పని అయ్యాక , ఎలా ప్రొసీడ్ అయ్యరొ ఎలా పని అయ్యిందో ఫొరం లో రాయాండి దాని వలన మిగతా వాల్లలో ఎవరికైన ఉపయోగం ఉండొచ్చు Smile


REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
మీరు పాస్ పోర్టు ఎప్పుడు పొందారు - ఏ కారణంతో పుట్టిన తేదీ మార్చాలని అనుకుంటున్నారో వివరాలు
తెలియచేసి ఉంటే - తగిన సలహా ఇవ్వడానికి సులువుగా ఉండేది. మీరు పాస్ పోర్టు కి మొదట దరఖాస్తు
చేసినప్పుడు పుట్టినతేదీ ధృవీకరణకి సర్టిఫికేటుని జతపరిచి ఉంటారు కదా (సాధారణంగా S.s.c). అందులో
ఉన్న తేదీ కి బదులు పొరఫాటుగా వేరే తేదీని పాస్ పోర్టులో ముద్రించి ఉంటే సులువుగా మార్చుకునే వీలు
ఉంటుంది. అదీ వీలైనంత త్వరలో సవరణ చేయించుకోవలసి ఉంటుంది.

పాస్ పోర్టుని పొందాక కొన్ని సంవత్సరాల తర్వాత పుట్టిన తేదీని మార్చమని అడిగితే మొదట దరఖాస్తులో
మనం వ్రాసిన పుట్టిన తేదీ, అప్పటి ధ్రువీకరణ పత్రం లోని పుట్టీన తేదీ తప్పుగా ఉన్నాయని తెలియడం
వల్ల - ఇప్పుడున్న పాస్ పోర్టు రద్దయ్యే ప్రమాదం ఉంటుంది. మునిస్పల్ బర్త్ రికార్డులలో పుట్టినతేదీ ని
మార్చడం, పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం ని పొందటం, మరల కొత్త తేదీతో పాస్ పోర్టుని పొందటం - ఇలా
అన్నీ పూర్తి అవడానికి చాలా కాలం పట్టవచ్చును ...
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)