Post: #1

మహిగారు

మీరు చెప్పిన Rollover మెనూ మాడల్ ఉపయోగించి నేను చేసిన వెబ్ సైట్ లో చక్కని మెనూ చేసి పెట్టాను. చాలా బాగా కుదిరింది. అయితే ఆవెబ్ సైట్ లో నేను Astrological clock క్రియేట్ చేసి, పెట్టవలసివుంది. దానికి నేను ఒక మాడల్ క్రియేట్ చేసాను. దాానికి సంబంధించిన ఇమేజ్ క్రింద ఇస్తున్నాను. అది పనిచేస్తోంది కూడా.

పైఇమేజిలో బ్యాగ్రౌండ్ సైట్ లోని బాడీ పార్ట్ కి సంబంధించినది. Astrological పార్ట్ ని బ్యాగ్రౌండ్ ఇమేజిగా తీసుకున్నాను. clock ని You are not allowed to view links. Register or Login to view. , You are not allowed to view links. Register or Login to view. సైట్ ల నుంచి ఎంబెడ్ చేసాను. ఈ మాడల్ పనిచేస్తున్నప్పటికీ ఒకసమస్య వుంది. సైట్ లో ఈclock చిన్నదిగా కనిపిస్తోంది. కాబట్టి ఇమేజిపరంగా బాగున్నా సైట్ పరంగా స్పష్టంగాలేదు. అందువల్ల ఇటువంటి మరొక బెటర్ అయిడియా ఏదైనా ఇవ్వగలరా? దీనిని సైట్ లో ఎక్కడ పెట్టినా అక్కడ స్పేస్ ని బట్టి సైజ్ డిసైడ్ చేసుకోవాలి. అంతేకాకుండా clock అనలాగ్ అయినా, డిజిటల్ అయినా పరవాలేదు. డిజిటల్ అయితే తేదీ, వారం కూడా రావాలి. లుక్ మాత్రం Astrological clock లాగా ఉండాలి. ఏ clock అయినా అందులో తిథి, వార, నక్షత్రములు తెలుగు క్యాలండర్ లో ఉన్నట్టు ఏరోజువి ఆకనిపించేలా చెయ్యవచ్చా? clock లో కాకపోతే మరోకంగానైనా సరే. ఇక్కడ హెడ్డర్ పార్ట్, బాడీపార్ట్ కి సంబంధించిన మరొక బ్యాగ్రౌండ్ ఇమేజిలను ఇస్తున్నాను

హెడ్డర్ ఇమేజి

బాడీపార్ట్ కి సంబంధించిన మరొక బ్యాగ్రౌండ్ ఇమేజి

అయితే సైట్ కి సంబంధించి ప్రైవసీ వల్ల హెడ్డర్ పూర్తి ఇమేజి ఇవ్వలేకపోయాను. హెడ్డర్ ఇమేజి సూర్యోదయం గాని, సూర్యాస్తమయం గాని అవుతుంది. దాని దృష్టిలో ఉంచుకుంటే అక్కడ ఇచ్చిన హెడ్డర్ ఇమేజి మ్యచ్ అయ్యేలా నీళ్ళలోంచి సగం పైకివచ్చి కనబడుతున్నట్టుగాని మరేదయినా ఐడియా గాని ఉంటే ఉంటే మంచిది. బాడీపార్ట్ లో అయితే నేను ఈపోస్టు మొదట్లో చెప్పినట్టు ఉన్నా పరవాలేదు. సైట్ పరంగా clock స్పష్టంగా ఉంటే చాలు. కానీ బాడీపార్ట్ లో ఎక్కడ పెట్టినా  అక్కడ స్పేస్ ని బట్టి సైజ్ డిసైడ్ చేసుకోవాలి. అక్కడ కలర్ కాంబినేషన్ కి మ్యాచ్ అవాలి. బాడీపార్ట్ నేను మీకు ఇచ్చిన రెండు బ్యాగ్రౌండ్ ఇమేజిలలాగా తప్ప మరోరకంగా లేదు.

Quote this message in a replyReply

Post: #2
1).ఈ మాడల్ పనిచేస్తున్నప్పటికీ ఒకసమస్య వుంది. సైట్ లో ఈclock చిన్నదిగా కనిపిస్తోంది. కాబట్టి ఇమేజిపరంగా బాగున్నా సైట్ పరంగా స్పష్టంగాలేదు. అందువల్ల ఇటువంటి మరొక బెటర్ అయిడియా ఏదైనా ఇవ్వగలరా?

జ: సైట్ లో ఈ క్లాక్ చిన్నదిగా కనిపిస్తుందన్నారు. మీరు తీస్కున్న ఒరిజినల్ క్లాక్ సైజ్ కంటే చిన్నగా కనిపిస్తోందా? ఒక వేళ ఒరిజినల్ సైజ్ అదే అయితే క్లాక్ సైజ్ ను పెంచండి. లేదా క్లాక్ లో ఇంకా ఎక్కువ మోడిఫికేషన్స్ చేయదలిస్తే అంటే కలర్స్ కానీ, టెక్స్ట్ కానీ, లేదా హై రెజొల్యూషన్ లోకి మార్చదలచినా మొదట ఈ క్లాక్ ను సిస్టమ్ లోకి డౌన్లోడ్ చేస్కొని డీకంపైల్ చేయండి. మీరు ఉపయోగిస్తున్నది swf క్లాక్ కాబట్టి డీకంపైల్ చేసి fla గా మార్చడానికి, Sothink SWF Decompiler లాంటి సాఫ్ట్వేర్లనుపయోగించండి.

2).దీనిని సైట్ లో ఎక్కడ పెట్టినా అక్కడ స్పేస్ ని బట్టి సైజ్ డిసైడ్ చేసుకోవాలి!!

జ: మీరు డివిజన్స్ తో సైట్ తయారు చేసివుంటే, క్లాక్ యొక్క డివిజన్ విడ్త్ ను 100% గా మార్చండి. ఒకవేళ టేబుల్స్ ఉపయోగిస్తున్నట్లయితే క్లాక్ యొక్క టీడీ విడ్త్ ను 100% గా మార్చండి. తర్వాత సోర్స్ ఫైల్ యొక్క విడ్త్ మరియు హైట్ ను కూడా 100% గా మార్చండి.

3).ఏ clock అయినా అందులో తిథి, వార, నక్షత్రములు తెలుగు క్యాలండర్ లో ఉన్నట్టు ఏరోజువి ఆకనిపించేలా చెయ్యవచ్చా? clock లో కాకపోతే మరోకంగానైనా సరే!!

జ: క్లాక్ లో కానీ, లేదా ఏదైనా విడ్జెట్ రూపంలో కానీ అలా కనిపించేలా చేయవచ్చు. దీనికి Flash లోని Action script ను కానీ, లేదా PHP కోడ్ నుపయోగించికానీ చేయగలము. అయితే ఇది చాలా సమయం తీస్కుంటుంది.

మీరు అడిగినట్లుగా నాకేమీ ఐడియా తట్టలేదు కాబట్టి, ఇతర సభ్యులు ఇచ్చే ఐడియాస్ కోసం ఎదురు చూద్దాం.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3

మహి గారు

మీరు ఇచ్చిన రిప్లై చూసి వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాను. ఇతర సభ్యుల నుంచి కూడా ఏమైనా ఐడియాస్ వస్తాయేమోనని ఎదురు చూడటం వల్ల కూడా సమాధానం ఇవ్వడానికి ఆలస్యమైంది. క్షంతవ్యుడను.

* ఇకపోతే ఈ క్లాక్ చిన్నదిగా కనిపించడం గురించి మీరిచ్చిన సూచన బాగుంది. కానీ నేనే అంతకంటే బెటర్ గా ఆలోచించి వేరే మాడల్ క్లాక్ డిజైన్ చేపాను. దానివల్ల చిన్నగా కనిపించడం అనే సమస్య పరిష్కారమయింది. ఆమాడల్ క్రింద ఇస్తున్నాను

 

* ఏ clock అయినా అందులో తిథి, వార, నక్షత్రములు తెలుగు క్యాలండర్ లో ఉన్నట్టు ఏరోజువి ఆకనిపించేలా చెయ్యవచ్చా? clock లో కాకపోతే మరోకంగానైనా సరే!!

దీని గురించి క్లాక్ లో కానీ, లేదా ఏదైనా విడ్జెట్ రూపంలో కానీ అలా కనిపించేలా చేయవచ్చు. దీనికి Flash లోని Action script ను కానీ, లేదా PHP కోడ్ నుపయోగించాలి అన్నారు.

నేను చెప్పేది ఏ మిటంటే...  రడీమేడ్ విడ్జెట్ దొరికితే మనం ప్రత్యేకంగా చెయ్యనక్కరలేదు కదా. అందులోనే పాత, క్రోత్త తేదీలకు పంచాంగం చూసుకోవాలి మరియు మరి ముహూర్తాలు, శుభసమయాలు వంటి మన నిత్యజీవితంలో ఉంపయోగించే ముఖ్యమైన విషయాలను చూసుకునే అవకాశం ఉండాలి.

* నేను పైన చూపించి క్రొత్త క్లాక్ ని గడియారం మాత్రమే పనిచేసేలా చేసాను కాని, టైముకి అనుగుణంగా అస్ట్రలాజికల్ గుర్తులు కూడా మారుతూ ఉండేలా ఏదైనా మాడల్ క్రియేట్ చేసి కమర్షియలైజ్ చేస్తే ఏలా ఉంటుంది అని నా ఆలోచన. దీనికి ఎవరైనా సహకారం అందిస్తారా?

Quote this message in a replyReply

Post: #4
తెలుగులో పంచాంగం విడ్జెట్ కావాలంటే You are not allowed to view links. Register or Login to view.

[iframe]http://panchangam.harivillu.org/[/iframe]

దీన్ని ఇంగ్లీషులోకి మార్చుకోవడం లేదా సమానమైన విడ్జెట్ ని ఆంగ్లంలో పొందటం వీలవుతుందా అనేది ప్రయత్నించండి
ఈ విడ్జెట్ ని ఉన్నది ఉన్నట్లుగా ఉపయోగించుకునేందుకు అందరికీ అనుమతి ఉంది. ఒకవేళ దీనికే మార్పులు, చేర్పులు
చేస్తే వెబ్ సైట్ లో పెట్టడానికి పై విడ్జెట్ రూపకర్త నుండి అనుమతి పొందాలి Smile
[alert]సభ్యులకి అవసరమున్న విషయాలలో పరిష్కారమార్గాన్ని సూచించగలము.
సృజనాత్మక నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు తగిన విధానాన్ని తెలుపగలము.
అంతకు మించిన సహకారాన్ని అందించడం సాధ్యపడదని మిత్రులు గమనించాలి[/alert]
Quote this message in a replyReply

Post: #5

mn48 గారు

తెలుగులో పంచాంగం విడ్జెట్ అందించినందుకు చాలా చాలా ధన్యవాదములు. ఇకపోతే మీ సూచన గమనించాను.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)