Post: #1

Pagemaker lo oka image place dwara teesukunnapudu aa image background white vastundi. ala rakunda photoshop lo Transparent file teesukuni image undi place chesina background white vastundi. So background lekunda pagemakerlo place chesukovatam yelago telupagalaru.


Quote this message in a replyReply

Post: #2

సతీష్ గారు మీరు అడిగిన ప్రశ్న అర్ధమయినట్టు ఉన్నా సరిగా అర్థం కాలేదు..నా ఉద్దేశ్యం ప్రకారం మీరు వైట్ ను ట్రాన్స్ పరెంట్ గా మార్చారు గాని సైజ్ మాత్రం క్రాప్ చెయ్యకుండా అలాగే ఉంచినట్టున్నారు .

అందువలన అయినా అయి ఉందవచ్చు

లేదా

మీరు .Jpg ఫార్మాట్ లో సేవ్ చేసి ఉండవచ్చు .

నిజానికి .Jpg ఫార్మాట్ ఆల్ఫా చానల్ సపోర్ట్ చెయ్యదు అందువలన కూడా అయి ఉండవచ్చు .

ఒక సారి సరిచూసుకుని రిప్లై ఇవ్వండి ...

Quote this message in a replyReply

Post: #3

ledu sir krinda type imageni aaa formatelo save chesina pagemakerlo place chestunte background white vastundi.

Quote this message in a replyReply

Post: #4
సతీష్ గారు

క్రింది లింక్ లోని ట్యుటోరియల్ లొ చెప్పిన విధంగా చేయండి

[iframe]http://chsprasad.blogspot.com/2008/04/blog-post_19.html[/iframe]
Quote this message in a replyReply

Post: #5
ప్రసాద్ గారు

సతీష్ గారు అడిగినదానికి మీరిచ్చిన పరిష్కారం బాగుంది. కానీ పేజ్ మేకర్ లో png ఫార్మేట్ గానీ, gif ఫార్మేట్ గానీ పనిచెయ్యడంలేదు. ఇమేజ్ కి బ్యాగ్రౌండ్ వచ్చేస్తోంది. దీనివల్ల సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది. నేను టెస్ట్ చేసి ఈమాట చెబుతున్నాను. మీరు ఉదాహరణగా పవర్ పాయంట్ లో టెస్ట్ చేసి చూపించారు. పేజ్ మేకర్ లో టెస్ట్ చేసి చూపించలేదు. సతీష్ గారు అడిగినది పేజ్ మేకర్ గురించి కదా...

కానీ నాకొక ఐడియా వచ్చింది. డిటిపి చేసేవాళ్ళదగ్గర అనూ గ్రాఫిక్స్ వాళ్ళ బ్లాక్ & వైట్ ఇమేజి సీడీలు ఉంటాయి. వాటిలోని ఇమేజెస్ eps ఫార్మేట్ లో ఉంటాయి. వాటిని పేజ్ మేకర్ లో ఉపయోగించినప్పుడు ఏవిధమైన బ్యాగ్రౌండు రాదు. అంతేకాకుండా పేజ్ మేకర్ లో వాటి కలర్ కూడా మార్చుకోవచ్చు. (ఈ మధ్య అనూ గ్రాఫిక్స్ వాళ్ళవి కలర్ ఇమేజి సీడీలు కూడా వచ్చాయి. అవి మాత్రం jpg ఫార్మేట్ లోనే ఉంటాయి. వాటి గురించి కాదు నేను చెప్పేది)
ఇమేజిని అనూ గ్రాఫిక్స్ వాళ్ళ బ్లాక్ & వైట్ ఇమేజి సీడీలలో లాగా eps ఫార్మేట్ లోకి ఎలా మార్చాలో చెబితే సతీష్ గారి సమస్య పరిష్కారం కావచ్చు. నాకు కూడా ఇమేజిని అనూ గ్రాఫిక్స్ వాళ్ళ బ్లాక్ & వైట్ ఇమేజి సీడీలలో లాగా eps ఫార్మేట్ లోకి మార్చడం రాదు. వీలైనంత త్వరలో ఈవిషయం గురించి సమాధానం ఇవ్వగలరు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)