Post: #1
సార్ ఫైర్ ఫాక్స్ లో సైట్ ఓపెన్ చేయగానే ‘‘మోసపూరిత సైటుగా నివేదించబడింది!
నందలి వెబ్‌సైటు మోసపూరితమైనదిగా నివేదించబడింది మరియు మీ రక్షణ అభీష్టాలదృష్ట్యా నిరోధించబడింది.
దాడి సైటులు మీవ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించు ప్రోగ్రామ్‌లను సంస్థాపించుటకు ప్రయత్నిస్తాయి, మీకంప్యూటర్ ఇతరులను దాడిచేయుటకు వుపయోగిస్తాయి, లేదా మీసిస్టమ్‌ను పాడుచేస్తాయి.
కొన్ని దాడిసైటులు కావాలని హానికారక సాఫ్ట్‌వేరును పంపిణిచేస్తాయి,కాని చాలావరకు వాటియజమానుల అనుమతిగాని లేదా సంబంధంగాని లేకుండానే రాజీకి వస్తాయి. ’’

అనే మెసేజ్ వస్తోంది. కాని ఇది మామూలు సైట్. You are not allowed to view links. Register or Login to view. . మిగతా బ్రౌజర్స్ లో బాగానే వస్తోంది. ఫైర్ ఫాక్స్ లో ఈ సమస్యకు పరిష్కారం తెలుపగలరు
- రాజు
Quote this message in a replyReply

Post: #2
ఆ హెచ్చరిక మీ ఫైరుఫాక్సు బ్రౌజరులోని సెట్టింగుల వల్ల గూగుల్ ద్వారా జారీ చేయబడింది
Quote:What happened when Google visited this site?
Of the 5 pages we tested on the site over the past 90 days, 2 page(s) resulted
in malicious software being downloaded and installed without user consent. ...


సందర్శకుల అనుమతి లేకుండా ఆ సైటు నుండి అనుమానాస్పద కోడ్ కంప్యూటరులలో చొరబడటాన్ని
గమనించడం వల్ల ఆ హెచ్చరిక కనిపించింది. కారణాన్ని జాగ్రత్తగా పరిశీలించి నష్టం ఉండదనుకుంటేనే
అలాంటి సైట్లని సందర్శించాల్సి ఉంటుంది. ఆ సైటుని పరీక్షించి చూసాను. ప్రస్తుతానికి మీరు ఎలాంటి
సందేహం లేకుండా ఫైరుఫాక్సు బ్రౌజరులో ఆ సైటుని వీక్షించవచ్చును
Quote this message in a replyReply

Post: #3
రాజు గారు,

నేను కూడా ఆ సైటును తరచుగా విజిట్ చేస్తుంటాను ఐతే గత కొన్ని నెలలుగా మీరు చెప్పినట్లుగా హెచ్చ్చరిక వస్తుంది. కాని మనం దానిని విజిట్ చేయవచ్చు హానికరం కాదు.

మిత్రులు mn48 చెప్పినట్లుగా మీరు నిరభ్యంతరంగా ఆ సైటును విజిట్ చేయవచ్చు.

ధన్యవాదాలు

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)