Post: #1

హలో ఫ్రెండ్స్,

డబుల్ ఇంజిన్స్ గురించి, రైస్ పుల్లర్స్ గురించి, 4 కాళ్లు 18 గోర్లు కలిగిన తాబేళ్ల గురించి మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేదా ఎక్కడైనా విన్నారా? నేను మాత్రం గత కొద్ది సంవత్సరాలు గా ఈ రెండింటి గురించి వింటున్నాను. ఇన్ని రోజులు వాటి గురించి పెద్దగా నమ్మేవాణ్ని కాదు. ఈ మధ్య కొంతమంది గ్రూపులు శ్రీశైలం అడవులలో తిరగడం గమనించాను. నేను ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ తో అడవుల్లోకి వెళ్లినపుడు వారిని కలిశాను. వారు చెప్పిన కొన్ని విషయాలు నిజమా? కాదా? అని నెట్ లో వెతికాను. నిజమో కాదో కానీ నెట్ లో మాత్రం వాటి గురించి భారీ ఎత్తున సమాచారం దొరుకుతుంది.

డబుల్ ఇంజిన్ (అదే రెండు తలల పాము) గురించి:

You are not allowed to view links. Register or Login to view.  You are not allowed to view links. Register or Login to view.

శ్రీశైలం లాంటి ప్రదేశాలలో ఈ పాముల గురించి వెతుకున్న వారి సంఖ్య చాలానే ఉంది. సరదాగా ఏ సాయంత్రం పూటో  ఫ్రెండ్స్ తో కలిస్తే అక్కడ ఎవరో ఒకరు ఈ టాపిక్ మొదలు పెట్టడం గత 5 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. రెండుతలల కేజీ పాము ధర కోటి రూపాయలని, 4 కేజీల పాము విలువ 50 కోట్ల వరకు ఉంటుందని చాలా సార్లు విన్నాను.

అసలు ఈ పాములతో ఏం చేస్తారని తెలుసుకొనే ప్రయత్నంలో తెలిసిన కారణాలు:

వెన్నెముకలో 32 పూసలు ఉన్న పాము దొరికితే 31వ పూస ను మెడలో కట్లుకుంటే అత్యంత జ్ఞానులు అవుతారని,

వీటి రక్తం కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు మందు రూపంలో ఉపయోగపడుతుందని,

ఈ పామును కలిగిన వారు అత్యంత ధనవంతులు అవుతారని,

ఇలా రక రకాల కారణాలు తెలిశాయి.

రైస్ పుల్లర్ గురించి:

You are not allowed to view links. Register or Login to view.  You are not allowed to view links. Register or Login to view.

ఈ రైస్ పుల్లర్ ధర ఇంచు ధర ఇండియాలో 10 కోట్ల నుంచి ఇతర దేశాలలో 50 కోట్ల వరకు ప్రస్తుత వ్యాపారం నడుస్తుందని, పూర్వ కాలంలో ఉపయోగించిన రాగి నాణేలు, దేవాలయాల గోపుర కట్టడాలలో ఉపయోగించిన రాగి రేకులకు పిడుగుల వల్ల ఒక ప్రత్యేకమయిన శక్తి (గురుత్వాకర్షణ శక్తి లాంటిది) ఏర్పడుతుందని, ఆ శక్తిని జర్మనీ, జపాన్ లాంటి దేశాలు అణుబాంబులకు ఉపయోగిస్తారని వారి మాటల్లో విన్నాను.

రైస్ పుల్లర్ చెక్ చేసే విధానం గురించి నేను విన్నది:

ఇవి వాటికి ఏర్పడిన శక్తిని బట్టి బియ్యం ఎదురుగా పెట్టినపుడు వెంటనే వాటిని అట్రాక్ట్ చేస్కొని తమ దగ్గరకు లాక్కుంటాయి. ఇవి ఎంత దూరం నుంచి లాక్కుంటాయి, అన్నదే వాటికి ఎంత శక్తి ఉంది అన్నది నిర్ధారిస్తుంది. ఉదా:కు 3 ఇంచుల దూరంలో నుంచి పుల్ చేస్తున్నట్లయితే ఇంచుకు 10 కోట్ల రూపాయలు ఇలా.... ఇంతే కాకుండా టార్చి లైట్ మరియు రేడియమ్ వాచ్ ల ద్వారా కూడా చెక్ చేస్తారని తెలిసింది. పూర్తిగా ఈ విధానంగురించి నాకు తెలియదు.

18 గోర్ల తాబేళ్ల గురించి:

18 గోర్లు కలిగిన తాబేళ్లను పెంచిన వారు కుబేరులవతారని, వీటి ధర 50 లక్షలు నుండి కోటి రూపాయల వరకు ఉంటుందని విన్నాను.

వీటి గురించి సమాచారమిస్తున్న వెబ్సైట్ లింక్స్

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
కొంచెం కొత్తగా కొంచెం వింతగా మరెంతో ఇంట్రస్టింగ్ గా చాలా బాగుందండి మీ పోస్టు.ఇలాంటి విలువైన సామాచారం అందించినందుకు ధన్యవాదాలు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)