Post: #1

మహి గారు నమస్తే,

నేను ఈమధ్య ఒక వెబ్ సైట్ క్రియేట్ చేస్తుంటే ఆసైట్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కలిగింది. వెంటనే నెట్ లో సెర్చ్ చేసాను. వచ్చి రిజల్ట్స్ చూస్తే నాకు ఏమీ అర్ధం కాలేదు. అవి క్లియర్ గా లేవో లేక నాకే అర్ధం కాలేదో తెలియలేదు. ఇదివరకెప్పుడో You are not allowed to view links. Register or Login to view. అనే సైట్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉందని చూసినట్టు గుర్తువచ్చి ఆసైట్ కి వెడితే ఆసైట్ ఓపెన్ కాలేదు. ఇంక లాభం లేదనుకుని మన ఫోరంలో సెర్చ్ చేస్తే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది కదా అని ఫోరంలో సెర్చ్ చేసాను. [SOLVED] బ్లాగ్ ఓపెన్ అయినపుడు బాక్గ్రౌండ్ మ్యూజిక్  You are not allowed to view links. Register or Login to view.  [SOLVED] బ్లాగ్ లలో గానీ, వెబ్ సైట్ లను గానీ ఓపెన్ చేసినప్పుడు....బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ ? You are not allowed to view links. Register or Login to view.  ఈరెండు పోస్టులు కనబడ్డాయి. వాటిలో You are not allowed to view links. Register or Login to view.  You are not allowed to view links. Register or Login to view.  You are not allowed to view links. Register or Login to view. అనే లంకెలు ఉదాహరణగా ఇచ్చారు. కానీ వీటిలో You are not allowed to view links. Register or Login to view. అన్నదాంట్లో మాత్రమే నాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాంటిది వినిపించింది. మిగిలిన రెండింటిలోనూ వినిపించలేదు. కారణం తెలియదు. అయితే You are not allowed to view links. Register or Login to view. సైట్ ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈసైట్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హోంపేజీలో మాత్రమే వస్తోంది. మరికొంచెం జాగ్రత్తగా గమనిస్తే హోంపేజీ మధ్యలో ఒక ఫ్లాష్ ఏనిమేషన్ ఉంది. అది లోడ్ అయ్యేవరకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రావడంలేదు. స్ర్కీన్ షాట్ చూడండి.

దీనిని బట్టి ఆసైట్ లో ఉన్నది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కాదని స్పష్టంగా తెలిసిపోతోంది.

అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే మన ఫోరంలోని పోస్టులలో ఇచ్చిన పరిష్కారం నాకు అర్ధంకాలేదు. వాటిలో చెప్పిన కోడ్ సైట్ html లో ఎక్కడ (హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్.... ఇలా) పెడితే పనిచేస్తుందో తెలియాలి. అలాగే సైట్ / బ్లాగుల్లో బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ పెట్టినట్టుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టవచ్చా? ఆమ్యూజిక్ తో సైట్ లోని ఏ ఆబ్జెక్ట్ తోను సంబంధం ఉండకూడదు You are not allowed to view links. Register or Login to view. లోలాగా. కానీ మ్యూజిక్ ప్లేయర్స్ లో లాగా వాల్యూమ్ కంట్రోల్స్ మాత్రమే ఉండవచ్చు. అవి కూడా లేకపోతే మరీ మంచిది. వీలవుతుందా. ఈవిషయమై సమగ్రసమాచారం ఇవ్వాలని కోరుతున్నాను.

అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా వాడదగిన మ్యూజిక్ ఫైల్స్ (ఇనుస్ట్రుమెంటల్ మాత్రమే) ఎక్కడ లభ్యమవుతాయి? సెర్చ్ చేస్తే వాయిస్ తో ఉన్నవే అంటే పాటలు లాంటివే దొరుకుతున్నాయి.

ధన్యవాదములు.

Quote this message in a replyReply

Post: #2
ఈ విషయంలో అనుభవం ఉన్న నిపుణులు ప్రతిస్పందించే ముందుగా నాకు తెలిసినది :

నిజానికి మీరు అనుకుంటున్నటువంటి సైట్ బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ ఎప్పుడూ తారసపడలేదు Smile
సౌండ్ బ్యాక్ గ్రవుండ్ బేసిక్సు ని ఇక్కడ చూడగలరు : You are not allowed to view links. Register or Login to view. ; You are not allowed to view links. Register or Login to view. ; You are not allowed to view links. Register or Login to view.

కొన్ని html టాగ్ కోడ్ లు కొన్ని రకాల బ్రౌజరులలోనే సమర్ధవంతంగా పనిచేస్తాయి. IE compatible
browsers లో పని చేసే కోడ్ netscape compatible browsers లో పని చెయ్యకపోవచ్చును.

అలాగే సౌండ్ ఫైలు మెమరీ సైజుని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కేవలం బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ కోసం
సందర్శకులు ఎక్కువ సైజు (eg. 3MB) ఫైలుని వినియోగించేలా చేయడం సరైన పద్ధతి కాదు. కనుక
సాధారణంగా ఆధ్యాత్మిక సైట్లలో వీలైనంత తక్కువ ఫైలు సైజుతో ఒక పదం / కొన్ని పదాల సముదాయం
మాత్రమే (eg. ఓమ్ , నారాయణాయ నమః ..) మరల వినపడేటట్లుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది

ఫ్రేముల విధానంలో స్టాటిక్ పేజి కంటెంట్ లో బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ ని ఏర్పాటు చేసుకుంటే మీరు కోరిన
ఎఫెక్టు లభించే వీలు ఉంది { ఇటీవలి కాలంలో వెబ్ సైట్లకి ఫ్రేమ్ లని ఉపయోగించే పద్ధతి బాగా తగ్గింది }
Quote this message in a replyReply

Post: #3

mn48 గారు

బ్లాగ్ లలో గానీ, వెబ్ సైట్ లలో గానీ బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ పెట్టడం గురించి... మీరిచ్చిన సమాచారం చాలా బాగుంది. అందులో You are not allowed to view links. Register or Login to view.  లో ఉన్న సమాచారం ఉపయోగించి నేను ఒక సైట్ కి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెట్టాను చాలా బాగా వస్తోంది. అలాగే మీరు చెప్పినట్టు సౌండ్ ఫైలు మెమరీ సైజుని కూడా దృష్టిలో ఉంచుకుని కేవలం 16KB సైజు మాత్రమే ఉన్న .WAV ఫైల్ ని loop లో వాడాను. మీరు ఫ్రేముల విధానంలో స్టాటిక్ పేజి కంటెంట్ లో బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ ని ఏర్పాటు చేసుకుంటే మీరు కోరిన ఎఫెక్టు లభించే వీలు ఉంది అన్నారు కదా. నాకు ఆఅవసరం రాలేదు. నేను డివిజన్ విధానంలోనే చేసాను. అయితే సౌండ్ కంట్రోల్స్ పెట్టుకునే దానిగురించి కూడా తెలియజేయగలరు.

అంతే కాకుండా మీరిచ్చిన సమాచారంతో Rollover మెనూకి కూడా సౌండ్ ఎఫెక్ట్ వచ్చేలా చేసాను. బాగానే వచ్చింది. దీనికి You are not allowed to view links. Register or Login to view. సైట్ లోని సమాచారాన్ని కూడా వినియోగించాను. ఇలాంటి Rollover మెనూ సౌండ్ ఎఫెక్ట్స్ Flash Websitesకి  ఉంటాయి. కానీ నేను html లో మెనూకి Rollover ఎఫెక్ట్ ఉన్నప్పుడు సౌండ్ ఎఫెక్ట్ పెట్టలేమా అని ఆలోచించాను. అయితే ఈప్రయత్నంలో ఒక సమస్య వస్తోంది. అదేమిటంటే... మెనూకి Rollover ఎఫెక్ట్ పనిచేస్తే సౌండ్ ఎఫెక్ట్ పనిచెయ్యడంలేదు. సౌండ్ ఎఫెక్ట్ పనిచేస్తే Rollover ఎఫెక్ట్ పనిచెయ్యడం లేదు. రెండింటిని సింక్రనైజ్ చెయ్యడం ఎలా? ఈవిషయం గురించి చెప్పగలరా? మాడల్ కోసం Link: You are not allowed to view links. Register or Login to view. లోని మెనూ అవసరమైతే ఉపయోగించగలరు.

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)