Post: #1
ఆపరేటింగ్ సిస్టం సిడి లేదా డివిడి లు ఒకో సందర్భంలొ మనం బూటబుల్ గా చేయా్ల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఇవి అనేక సందర్భాలు ఉంటాయి. IsoBuster ఉపయోగించి అలా చేసుకోవచ్చు అనేది ఇంతకు ముందు ఇదే ఫోరం లో వేరే పోస్ట్ లొ ఉదహరించడం జరిగింది. క్రింది లింక్ చూడండి.

You are not allowed to view links. Register or Login to view.

ఈ మధ్యన నేనొక సందర్భంలొ ఇలాంటి సమస్యనే ఎదుర్కొని సమస్యకు పరిష్కారం కనుగొనటంలొ నాకు ఒక కొత్త విషయం తెలిసింది. దానిని మన ఫోరం సభ్యులతో షేర్ చేసుకునేందుకు ఇక్కడ పొందుపరుస్తున్నాను.

నాకు ఎదురైన సందర్భం:
ఆపరేటింగ్ సిస్టం Windows 7 Professional ను ఒక ఇంజనీరింగ్ కాలేజి కొరకు 180 కెపాసిటికి Microsoft నుండి కొనటం జరిగింది (బహుశా కార్పొరేట్ లిమిటెడ్ ఎడిషన్ కావచ్చు). దానిని ఒక స్టూడెంట్ పర్సనల్ కంప్యూటర్ లో ఇనస్టాలేషన్ కు కాలేజి యాజమాన్యం తరఫున అంగీకారం తెలిపి, డివిడి ఇవ్వకుండా కాపి ఇస్తామని చెప్పటం జరిగింది. ఇక్కడ జరిగిన పొరపాటే ఈ పోస్ట్ కు ఆధారం. ఆ పొరపాటేమిటంటే ఆ డివిడి ని ఇమేజ్ గా కాపి చేసి ఇవ్వకుండా, ఆ డివిడి లొని ఫైళ్ళ ను మాత్రం ఒక పెన్ డ్రైవ్ లోకి కాపి చేసి ఇచ్చారు. ఆ ఫైల్స్ మొత్తం డివిడి లోకి రైట్ చేసినా అది బూటబుల్ కాదు. ఇదీ సమస్య.

ఈ క్రమంలొ నాకు ఒక సాఫ్ట్ వేర్ గుర్తుకు వచ్చి దాని లేటెస్ట్ వెర్షన్ కొరకు అంతర్జాలంలో వెదికాను. ఈ లింక్ నుండి దానిని డౌన్ లోడ్ చేసుకున్నాను. ఇక దానిని ఉపయోగించి ఆ కాపి చేయబడిన ఫైల్స్ నుండి బూటబుల్ డివిడి ని క్రియేట్ చేసుకునే విధానం క్రింది తెరపట్టుల సహాయంతో చూద్దాం.

1. ఆపరేటింగ్ సిస్టం నుండి కాపి చేయబడిన ఫైల్స్ ఉన్న ఫోల్డర్ (Win7) కాంటెంట్స్ క్రింది తెరపట్టు లొ చూడండి. -.txt ఫైల్ అదనంగా జోడించబడినది. ఇదేవిధంగా మనకు కావలసిన అవసరమైన వివిధ సాఫ్ట్ వేర్ లను డివిడి సైజ్ రీత్యా పట్టినంతవరకు ఇదే ఫోల్డర్ లో జోడించి మన విండొస్ 7 పర్సనల్ డివిడి ని తయారుచేసుకోవచ్చు. కాని అది చట్ట విరుద్ధం కనుక దానిని ఈ ఫోరంలో ఎంకరేజ్ చేయటం లేదు.

[Image: a71a4347.png]

2. నేను ఉపయోగించిన BootIsoMaker సాఫ్ట్ వేర్ కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి
You are not allowed to view links. Register or Login to view.

3. BootIsoMaker లోని ఫైల్స్, దానిలొ ఉన్న Bin ఫోల్డర్ లొని ఫైల్స్ ను క్రింది తెరపట్టుల లొ చూడండి.

[Image: 1870b047.png]

[Image: d3183a7f.png]

4. BootIsoMaker లోని కాంటెంట్స్ ను ఇంతకు ముందు మన దగ్గర ఉన్న బూటబుల్ డివిడి నుండి కాపి కాబడిన ఫైల్స్ ఉన్న ఫోల్డర్ Win7 లోనికి Extract చేయండి.
అపుడు ఆ ఫోల్డర్ లోని కాంటెంట్స్ ను క్రింది తెరపట్టులొ చూడండి

[Image: fcacdf3b.png]

5. ఇపుడు Win7 ఫోల్డర్ ను ఓపెన్ చేసి దానిలోని BootIsoMakerV3.cmd ని క్లిక్ చేయండి. క్రింది విధంగా మీకు వస్తుంది. ఇక్కడి నుండి ఇక BootIsoMaker పని క్రమాన్ని మనం క్రింది తెరపట్టులలో చూడవచ్చు.

[Image: e8735c2a.png]

[Image: b49b05b6.gif]

6. ఇపుడు boot.win ను మనం దీనిలో ఓపెన్ చేయాలి

[Image: f20393b0.png]
[Image: 9f9fbb75.png]

7. ఇపుడు New.Iso అనే ఫైల్ క్రియేషన్ మొదలౌతుంది.

[Image: 49af7dc1.png]
[Image: a71d7ee6.png]

8. ఇపుడు ఒక ఖాళీ డివిడిని మీ డ్రైవ్ లో ఉంచండి. y ఎంచుకుని ఎంటర్ ప్రెస్ చేయండి.

[Image: 3026df9b.gif]

[Image: 276c3d37.png]

అంతా పూర్తయి ఇక శుభం కార్డ్ పడుతుంది

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
చాలా మంచి tutorial ను అందించారు ప్రసాద్ గారు. ధన్యవాదములు.
Quote this message in a replyReply

Post: #3
------.ప్రసాద్ గారు చాలా మంచి ట్యుటోరియల్ ను అందించారు.----
----------------ధన్యవాదాలు----------------
Quote this message in a replyReply

Post: #4
Thank q verymuch Prasad garu...baagaa explain chesaru
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)