Post: #1
హాయ్ ఫ్రెండ్స్!

గతంలో ఫోటోషాప్‌లో 3D Text ఎలా క్రియేట్ చేయాలో ఒక ట్యుటోరియల్‌లో వివరించడం జరిగింది. అడోబ్ ఇల్లుస్ట్రేటర్‌లో 3D Text సులభంగా ఎలా క్రియేట్ చేయాలో ఈ ట్యుటోరియల్‌లో తెలుసుకుందామా మరి?

అడోబ్ ఇల్లుస్ట్రేటర్‌ను కొత్తగా ప్రాక్టీసు చేసేవారికి ఈ ట్యుటోరియల్ చాలా ఉపయోగపడుతుంది. ఇల్లుస్ట్రేటర్‌లో ఉన్న ఎన్నోరకాల టూల్స్‌నుపయోగించి అనేక రకాల వెక్టార్ గ్రాఫిక్స్ సృష్టించవచ్చు. ఈ ట్యుటోరియల్ వరకు మీరు టైప్ టూల్, 3డీ ఎఫెక్ట్ మరియు పాలిగనల్ ఎక్స్పాండింగ్ వంటి కొన్నింటిని కవర్ చేయవచ్చు. ట్యుటోరియల్‌లోకి వెళ్దామా మరి? ఇక ఫస్ట్ స్టెప్ కు వచ్చేయండి.

1. అడోబ్ ఇల్లుస్ట్రేటర్‌ను ఓపెన్ చేసి టైప్ టూల్‌నుపయోగించి క్రింది విధంగా మీకు నచ్చిన టెక్స్ట్‌ను టైప్ చేయండి.

A simple way to create 3D Text in Adobe Illustrator - Telugu Tutorials : step-1

2. టెక్స్ట్‌ను మీకు నచ్చిన రంగుతో నింపండి.

A simple way to create 3D Text in Adobe Illustrator - Telugu Tutorials : step-2

3. క్రింద చూపిన విధంగా Effect >> 3D >> Extrude & Bevel ను క్లిక్ చేయండి.

A simple way to create 3D Text in Adobe Illustrator - Telugu Tutorials : step-3

4. 3D Extrude & Bevel Options లోని Preview కు టిక్ మార్క్ పెట్టి Parameters మీకు నచ్చిన విధంగా మార్చండి.

A simple way to create 3D Text in Adobe Illustrator - Telugu Tutorials : step-4

పై స్టెప్‌తో 3డీ టెక్స్ట్ క్రియేట్ అయినట్లే. అయితే కలర్ అప్లై చేసినపుడు టోటోల్ అబ్జెక్ట్‌కు కలర్ చేంజ్ అవుతుంది. ఫ్రంట్ ఫేస్‌కు మాత్రమే వేరే కలర్ అప్లై అవాలంటే ఫ్రంట్ ఫేస్‌ను విడదీయవలసి ఉంటుంది. దీని కోసం 5 వ స్టెప్ నుంచి అనుసరించండి.

5. క్రింద చూపిన విధంగా Object >> Expand Appearance ను క్లిక్ చేయండి.

A simple way to create 3D Text in Adobe Illustrator - Telugu Tutorials : step-5

6. ఇపుడు అబ్జెక్ట్‌ను అన్‌గ్రూప్ చేయండి.

A simple way to create 3D Text in Adobe Illustrator - Telugu Tutorials : step-6

7. క్రింద చూపిన విధంగా Expand క్లిక్ చేయండి.

A simple way to create 3D Text in Adobe Illustrator - Telugu Tutorials : step-7


8. Direct Selection Tool నుపయోగించి అబ్జెక్ట్ యొక్క ఫ్రంట్ ఫేసెస్‌ను మాత్రమే సెలెక్ట్ చేయండి.

A simple way to create 3D Text in Adobe Illustrator - Telugu Tutorials : step-8

9. Swatches పాలెట్‌నుపయోగించి ఫ్రంట్ ఫేస్ వరకు మీకు నచ్చిన రంగును నింపండి.

A simple way to create 3D Text in Adobe Illustrator - Telugu Tutorials : step-9

10. Select >> Inverse ను క్లిక్ చేసి సైడ్ ఫేసెస్‌కు గ్రేడియెంట్‌ను అప్లై చేయండి.

A simple way to create 3D Text in Adobe Illustrator - Telugu Tutorials : step-10

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)