Post: #1
Create/Delete/Add password user accounts using MS DOS Commands

విండోస్‌లో యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి సాధారణంగా కంట్రోల్ ప్యానల్ ఉపయోగిస్తుంటాము. అయితే MS DOS Commands నుపయోగించి ఇంకా వేగంగా యూజర్స్‌ను క్రియేట్/డెలిట్ చేయవచ్చు, మరియు యూజర్స్‌కు పాస్వర్డ్స్ యాడ్ చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందామా?
  • కంప్యూటర్లో ఉన్న యూజర్స్‌ను తెలుసుకోవడానికి Start >> Run ను క్లిక్ చేసి cmd అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇపుడు MS DOS ఓపెన్ అవుతుంది.
    net user అని టైప్ చేయండి. క్రింది విధంగా అన్నీ యూజర్ అకౌంట్స్ చూపిస్తుంది. (ఇక్కడ EVEREST అనేది నేను ఉపయోగించే కంప్యూటర్ యూజర్ నేమ్)

    [Image: useraccountsusingmsdosc.jpg]

Note: user_name కు బదులుగా మీ కంప్యూర్లోని యూజర్ నేమ్ టైప్ చేయండి.
  • కొత్త యూజర్‌ను క్రియేట్ చేయడానికి: net user user_name /add అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. క్రింది స్క్రీన్‌షాట్‌లో చూడండి. ఇక్కడ నేను harshini అనే యూజర్ ను క్రియేట్ చేశాను. The command completed successfully అనే మెసేజి కనిపిస్తే యూజర్ క్రియేట్ అయినట్లే.

    [Image: useraccountsusingmsdosc.jpg]
    [Image: useraccountsusingmsdosc.jpg]
    [Image: useraccountsusingmsdosc.jpg]
  • యూజర్‌ను డెలిట్ చేయడానికి: net user user_name /delete అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
  • యూజర్‌కు పాస్వర్డ్ సెట్ చేయడానికి net user user_name*-change / అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
  • మీ కంప్యూటర్‌కు కనెక్ట్ అయి ఉన్న అన్నీ లోకల్ గ్రూప్స్‌ను చూడటానికి: net localgroup అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
  • అలాగే లోకల్ గ్రూప్‌లోని అందరు యూజర్స్‌ను చూడటానికి net localgroup power users అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
  • లోకల్ గ్రూప్ లోని ఒక యూజర్‌ను చూడటానికి net localgrojup power users user_name / అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.


[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)