Post: #1
ప్రస్తుతం మార్కెట్‌లో లభించే మదర్ బోర్డ్‌తో పాటు ఇచ్చే మదర్ బోర్డ్ డివైజ్ డ్రైవర్ ఇన్స్టాలేషన్ సీడీ ఆటోమేటిక్ సెటప్ సదుపాయంతో అందజేస్తున్నారు. అంటే ఆ సీడీని డ్రైవ్‌లో ఇన్సెర్ట్ చేయగానే కేవలం సింగల్ క్లిక్‌నుపయోగించి ఆ మదర్ బోర్డ్ కు సంబంధించిన అన్నీ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయవచ్చు. కొన్ని మదర్ బోర్డ్ సీడీలలో అయితే ఏ డ్రైవర్స్ ఇన్స్టాల్ కావాలో వాటిని మాత్రమే సెలెక్ట్ చేస్కొని ఇన్స్టాల్ బటన్‌ను క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయే సదుపాయం కూడా లభిస్తుంది. ఇంకా కొన్నింటిలో డ్రైవర్ సీడీ పెట్టగానే ఎటువంటి క్లిక్ చేయకుండా హార్డ్‌వేర్‌ను డిటెక్ట్ చేస్కొని ఏ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలో అదే తెలుసుకొని ఇన్స్టాల్ చేసే విధంగా కూడా లభిస్తున్నాయి.

అయితే ఏదో ఒక డ్రైవర్ మాత్రమే మిస్ అయినపుడు ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఈ ట్యుటోరియల్‌లో తెలుసుకుందాం. అసలు మీ కంప్యూటర్లో అన్నీ డ్రైవర్స్ సరిగా ఇన్స్టాల్ అయి ఉన్నాయా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ఈ క్రింది విధంగా చేయండి. (Windows XP కి మాత్రమే)

1. My Computer మీద రైట్ క్లిక్ చేసి Properties క్లిక్ చేయండి.

[Image: installmotherboarddrive.jpg]

2. System Properties విండోలో Hardware ట్యాబ్‌ను క్లిక్ చేసి Device Manger క్లిక్ చేయండి.

[Image: installmotherboarddrive.jpg]

3. ఇపుడు Device Manager లో చూడండి. ఏదైనా డివైజ్ పసుపు రంగు కొశ్చెన్ మార్క్‌తో చూపిస్తున్నట్లయితే మీ కంప్యూటర్లోని ఆ డివైజ్‌కు డ్రైవర్స్ ఇన్స్టాల్ కానట్లే అని అర్థం. క్రింది స్క్రీన్ షాట్‌లో చూడండి. ఇందులో SM Bus Controller డ్రైవర్స్ ఇన్స్టాల్ కాలేదని అర్థం. మరి ఆ డ్రైవర్ మాత్రమే ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది తర్వాత స్టెప్‌లో చూడండి.

[Image: installmotherboarddrive.jpg]

4. కొశ్చెన్ మార్క్ కనిపిస్తున్న ఎంట్రీ మీద రైట్ క్లిక్ చేసి Properties క్లిక్ చేయండి.

[Image: installmotherboarddrive.jpg]

5. Properties విండోలో Driver ట్యాబ్‌ను క్లిక్ చేసి Update Driver ను క్లిక్ చేయండి.

[Image: installmotherboarddrive.jpg]

6. మీ మదర్ బోర్డ్ డ్రైవర్స్ సీడీని సీడీ డ్రైవ్‌లో ఇన్సెర్ట్ చేసి Next బటన్‌ను క్లిక్ చేయండి.

[Image: installmotherboarddrive.jpg]

అంతే ఆటోమేటిక్‌గా మీ మదర్ బోర్డ్ సీడీ నుండి ఆ డ్రైవర్స్ మాత్రమే ఇన్స్టాల్ చేయబడతాయి.

Note: కొన్ని డివైజ్‌లకు ఆపరేటింగ్ సిస్టమ్ లో ముందుగానే ఇన్స్టాల్ చేయబడిన System files ను ఆధారం చేస్కొని డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతాయి. అటువంటి డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసే సమయంలో ఆ System files ను ముందుగా ఇన్స్టాల్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ సీడీని ఇన్సెర్ట్ చేయమని అడుగుతుంది. అపుడు మొదట OS CD లో నుండి system files ను ఇన్స్టాల్ చేసి, తర్వాత డివైజ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
మదర్ బోర్డ్ డ్రైవర్స్ ఇన్ స్టాలెసన్ గురించి తెలియజేసినందు కు MahiGrafix వారికి చాలా Thanks
Quote this message in a replyReply

Post: #3
mahigrafix garu thanks andi,all ur post are nice ....thanks once again
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)