Post: #1
మీ కంప్యూటర్లోని డాటా లాస్ కాకుండా మీ హార్డ్ డ్రైవ్ ఫైల్ సిస్టమ్‌ను Fat32 to NTFS / NTFS to Fat32 కు ఎలా మార్చుకోవాలో ఈ ట్యుటోరియల్‌లో తెలుసుకుందాం.
  • NTFS మరియు FAT32 అంటే ఏమిటి?

    NTFS, FAT32 అనేవి విండోస్‌లో పని చేయగలిగే హార్డ్ డ్రైవ్ యొక్క ఫార్మాట్స్ లేదా ఫైల్ సిస్టమ్స్. (ఇలాగే లినక్స్‌లో పని చేయడానికి హార్డ్ డ్రైవ్స్ EXT2, EXT3 అనే ఫైల్ సిస్టమ్ ను కలిగి ఉంటాయి.) విండోస్ 98SE వరకు FAT32, FAT16 ఫైల్ టైప్‌ను కలిగి ఉన్న హార్డ్ డిస్క్‌లు ఉండేవి. విండోస్ XP కొరకు NTFS ఫైల్ టైప్ తయారు చేయబడింది. NTFS ఫైల్ సిస్టమ్ FAT32 కంటే అతి వేగవంతమైనది. ముఖ్యంగా చెప్పాలంటే డీఫ్రాగ్‌మెంట్ విషయంలో FAT32 కంటే NTFS చాలా వేగంగా పని చేస్తుంది.
  • ఎక్కువ శాతం NTFS నే ఎందుకు ఉపయోగిస్తారు?

    FAT32 హార్డ్ డ్రైవ్‌లో 4జీబీ కంటే ఎక్కువ సైజును కలిగి ఉన్న RAR ఫైల్‌ను UNRAR చేయడానికి ప్రయత్నించి చూడండి. "మీ హార్డ్ డ్రైవ్‌లో తగినంత ఖాళీ లేనందున మీరు ఈ ఫైల్‌ను అన్‌ప్యాక్ చేయలేరు" అనే మెసేజి చూపిస్తుంది. ఎందుకంటే FAT32 (4జీబీ కంటే ఎక్కువ) సైజు కలిగి ఉన్న ఫైళ్లను పూర్తిగా సపోర్ట్ చేయలేదు. ఇలాంటి ఇంకా ఎన్నో కారణాల వలన ఎక్కువ శాతం NTFS నే ఉపయోగిస్తారు.
  • ఏ డ్రైవ్ ఏ ఫైల్‌టైప్‌నుపయోగించకుంటుందో తెలుసుకోవడం ఎలా?

    My Computer మీద క్లిక్ చేసి అందులో కనిపించే డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసి Properties క్లిక్ చేయండి. సహజంగా General ట్యాబ్‌లో ఆ డ్రైవ్ యొక్క ఫైల్ సిస్టమ్ కనిపిస్తుంది. ఉదా:కు క్రింది స్క్రీన్ షాట్‌లో H డ్రైవ్ యొక్క ఫైల్ సిస్టమ్ NTFS. ఇలాగే FAT32 అని కనిపిస్తే అది FAT32 ఫైల్ సిస్టమ్‌నుపయోగించుకుంటున్నట్లు అర్థం.

    [Image: fat32tontfsntfstofat325.jpg][Image: fat32tontfsntfstofat326.jpg]

  • ఆల్రెడీ రన్ చేస్తున్న FAT32 ఫైల్ సిస్టమ్ కలిగి ఉన్న డ్రైవ్‌ను డాటా లాస్ కాకుండా NTFS ఫైల్ సిస్టమ్‌లోకి మార్చడం ఎలా?

    దీనికోసం ప్రత్యేకంగా ఎటువంటి సాఫ్ట్వేర్ ఉపయోగించనవసరంలేదు. మీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటే ఇన్స్టాల్ అయే డాస్ ప్రోగ్రామ్‌నుపయోగించి కన్వర్ట్ చేయవచ్చు. అలా చేయడానికి క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

    1. Start >> Run ను క్లిక్ చేయండి.

    [Image: fat32tontfsntfstofat321.jpg]

    2. Run లో cmd అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. (MSDOS ప్రోగ్రామ్ ఓపెన్ అవటం కోసం)

    [Image: fat32tontfsntfstofat322.jpg]

    3. ఇపుడు కనిపించే MSDOS విండోలో cd c:\ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. (డైరెక్ట్‌గా C డ్రైవ్‌లోకి వెళ్లడానికి ఈ కమాండ్.)

    [Image: fat32tontfsntfstofat323.jpg]

    4. ఇపుడు convert x: /fs:ntfs అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. (Note: ఇక్కడ X అనేది మీరు ఏ డ్రైవ్‌నైతే NTFS లోకి మార్చాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ లెటర్. ఉదా:కు D డ్రైవ్‌ను మీరు NTFS లోకి మార్చాలనుకుంటే ఆ డ్రైవ్ లెటర్ X ప్లేస్‌లో టైప్ చేయండి.)

    [Image: fat32tontfsntfstofat324.jpg]

    5. ఇపుడు Convert lost chains top files Y/N? అనే ప్రశ్న కనిపిస్తుంది. కీబోర్డ్‌లో Y ప్రెస్ చేయండి. ఇక కన్వర్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది కంప్లీట్ అయేంతవరకు వెయిట్ చేయండి. కన్వర్షన్ పూర్తి కాగానే కన్వర్షన్ వాజ్ సక్సెస్‌ఫుల్ అనే మెసేజి వస్తుంది. exit అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇపుడు మీరు కన్వర్ట్ చేసిన డ్రైవ్ ఫైల్ సిస్టమ్‌ను పైన చెప్పిన విధంగా My Computer ఓపెన్ చేసి చెక్ చేయండి.
  • డాటా లాస్ కాకుండా NTFS ఫైల్ సిస్టమ్‌ను FAT32 ఫైల్ సిస్టమ్‌లోకి మార్చడం ఎలా?

    సింపుల్‌గా చెప్పాలంటే You are not allowed to view links. Register or Login to view. మీ డాటా లాస్ కాకుండా NTFS ఫైల్ సిస్టమ్‌ను FAT32 ఫైల్ సిస్టమ్‌లోకి మార్చగలుగుతుంది.

    [Image: personalbox.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Thank you sir, Very useful to me.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)