Post: #1
"జయ జయ మహాదేవ శంభో హరా శంకరా" కు పేరడీ You are not allowed to view links. Register or Login to view. సేకరించబడింది

Quote:జయ జయ మహా యంత్ర రాజా కంప్యూటరా!
డేటా కన్వర్టరా ! చాట్ ప్రోగ్రామరా !
వైరసుల్, బగ్గులు, హేకర్లు నిన్ను బాధించ గలరన్న
నేనెంత వాడన్ 'విండోధరా'...
సైబరారణ్య మధ్యంబునన్
'డాస్' వై పుట్టి 'విండోస్' గా మారగన్
పెంటియము వంటి పవరున్న చిప్ ఆకృతిన్
సీడి-డీవీడి రాముండ వైనట్టి చక్రాయుధున్
మూషికమ్మే మౌస్ రూపమ్ము ధరియించ విఘ్నాకృతిన్! కంప్యూటరున్

హార్డ్ డ్రైవా! కీ బోర్డు స్వభావా !
టవర్, స్పీకర్లు, గిగా హెర్ట్జ్, గిగా బైట్ల ప్రింటర్ సమూహా
ఇంటర్ నెట్ అన్న జాలంబు, జ్ఞానంబు నీవే కదా !
ఆన్ లైన్ సోదరా, జగతి జనమేల్ల ఇ-మెయిల్ తో కలిపేటి
కాంట్రాక్టరా ! కంప్యూటరా ! ప్రభో ....


పాస్కల్-లోటస్సు-సి -బేసిక్-సి ప్లస్సు-ప్లస్ ప్లస్సు-ఒరకిల్లు జావాల భాషా ధరా !
డిస్క్-కాం పేక్టు డీవీడి రైటర్ లతో ఒప్పు బరువైన డెస్క్ టాపు కంప్యూటరా !
లైట్ వెయిటున్న లేడీస్ కి సైతమ్ము సులభముగా ఒళ్ళోన అమరేటి లేప్ టాపు కంప్యూటరా !
నీవు పదిలముగా పవళించి అరచేత వైకుంఠమును చూపు పదునైన బ్లాక్ బెర్రీ కంప్యూటరా !
నీకు కోపాగ్ని కలిగించ - బబులేమో పగిలించి - సిలికాన్లో దడ పుట్టి - లే ఆఫ్ కలిగించు డాట్ కాం దామోదరా !
ఐ. టి. దేవా ! నమస్తే ! మెగస్తే ! గిగస్తే కంప్యూటర్ !
Quote this message in a replyReply

Post: #2
Smile చాలా బాగుందండీ!

నాకయితే ఈ క్రింది వాక్యాలు బాగా నచ్చాయి.
Quote:హార్డ్ డ్రైవా! కీ బోర్డు స్వభావా !
టవర్, స్పీకర్లు, గిగా హెర్ట్జ్, గిగా బైట్ల ప్రింటర్ సమూహా
ఇంటర్ నెట్ అన్న జాలంబు, జ్ఞానంబు నీవే కదా !
ఆన్ లైన్ సోదరా, జగతి జనమేల్ల ఇ-మెయిల్ తో కలిపేటి
కాంట్రాక్టరా ! కంప్యూటరా ! ప్రభో ....

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
Ouiబాగుంది.
Quote this message in a replyReply

Post: #4
చాలా చాలా బాగుంది
Quote this message in a replyReply

Post: #5
chala bagundhi sir
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)