Post: #1
యూట్యూబ్ వీడియోలను మనం తరచుగా బ్లాగులలో, వెబ్సైట్స్‌లో, ఫోరమ్‌లలో పోస్టు చేస్తుంటాము. అయితే యూట్యూబ్ వీడియోలో మొత్తం ఎంబెడ్ చేయకుండా కావలసిన టైమ్ నుంచే వీడియో స్టార్ట్ కావాలంటే ఈ టిప్ ఉపయోగపడుతుంది. ఉదా:కు ఒక యూట్యూబ్ వీడియో లెంత్ 5 నిముషాలుందనుకోండి. మొదటి ఒక్క నిముషం తర్వాత ప్లే అయే వీడియోను మాత్రమే మీరు ఎంబెడ్ చేయాలనుకుంటున్నారు. అలాంటపుడు 1 నిముషం వీడియో ప్లే అయిన తర్వాత రైట్ క్లిక్ చేసి క్రింది విధంగా Copy video URL at current time అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలు. కాపీ అయిన URL ను ఎక్కడ పోస్టు చేసినా ఆ వీడియోలో 1 నిముషం తర్వాత నుండి వీడియో స్టార్ట్ అవుతుంది. ఈ పద్ధతిలో URL కు అదనంగా #t=60s అనే వాల్యూ యాడ్ అవుతుంది.
[Image: youtubetime2.jpg]

[Image: youtubetime.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)