Post: #1
సంతోశాన్ని చూద్దామని
వెలుగు కొరకు వెతుకుతుంటే
నాకు నువ్వు దొరికావు., ఆ తర్వత నేను కూడా.
ఇప్పుడు వెలుగు నా వెనకాలే,.. నాతో పాటు చివరివరకు!

బయమంటే బయపడ్తారెందుకో జనం
బయంలో బాధ ఉంటుందని
అదే నిజమని తెలియదా!!

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
(12-Dec-2010 08:33 AM)REL Wrote: You are not allowed to view links. Register or Login to view.సంతోశాన్ని చూద్దామని
వెలుగు కొరకు వెతుకుతుంటే
నాకు నువ్వు దొరికావు., ఆ తర్వత నేను కూడా.
ఇప్పుడు వెలుగు నా వెనకాలే,.. నాతో పాటు చివరివరకు!

బయమంటే బయపడ్తారెందుకో జనం
బయంలో బాధ ఉంటుందని
అదే నిజమని తెలియదా!!

మిత్రమా భయం మన ఉనికిని గుర్తు చేస్తుంది. తద్వారా మనలను మనం ఒకమారు వెనకకు మళ్ళి అదే బలంతో ముందుకు దూసుకుపోయే (చిరుత గెంతే ముందు వెనకడుగు వేసినట్లు) శక్తినిస్తుంది. బాధ ఓ తీపి గాయం మాత్రమే. అది జీవన మాధుర్యాన్ని గుర్తుచేసే ఓ చేదు గుళిక. కాదంటావా?
Quote this message in a replyReply

Post: #3
ఇప్పుడు వెలుగు నా వెనకాలే,.. నాతో పాటు చివరివరకు!

చాలా బాగుంది మిత్రమా...!!

మంచి భావావేశం...అభినివేశనం....

అలాగే కుమార్ వర్మ గారి రసతార్కికత


అయితే వెలుగు వెనుక చీకటి కూడా మీతో పాటు చివరి వరకూ వస్తూంటూంది....వస్తూ.....ఉంటుంది. వస్తూనే..........!! (ఉం...టుం..ది)
అది కూడా మరచిపోవద్దు మిత్రమా...!!

మనిషి దు:ఖాన్ని కూడా కోరుకోవాలి ఎందుకంటే అతనికి సుఖపడే యోగం ఉంటుంది కాబట్టి....!!

సో....

మంచి ఆలోచనలు కలిగిన వారికి ఎప్పుడూ కూడా భయాలు, బాధలు, దు:ఖాలు, సుఖాలు, చీకటి వెలుగులు ఏమీ బాధించవు.
ఇంకా ఎనర్జిటిక్ గా తయారు చేస్తాయి.

ఇలా మంచి గాఢ నివేశనం కలిగించే, రసస్ఫూర్తి కలిగించే మీ ఇరువురి ఆలోచనలు మా అందరితో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)