Post: #1
నా దగ్గర 500 GB ఎక్‌‌ష్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంది. నేను విండోస్ ఎక్స్‌‌పి వాడుతున్నాను. దాన్ని కనెక్ట్ చేసినా కూడా నా కంప్యూటర్‌‌లో కనిపించడం లేదు.దాన్ని నా కంప్యూటర్ అస్సలే డిటెక్ట్ చెయ్యడం లేదు. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా?
లేక అందులోని డేటా అంతా కోల్పోవలసిందేనా?

మంచి సమాధానం ఆశిస్తూ..... ముందుగానే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Quote this message in a replyReply

Post: #2
శర్మ గారు,

మీ హార్డ్ డిస్క్ కంపెనీ పేరు తెలియజేయగలరు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
CAVALRY
Quote this message in a replyReply

Post: #4
శర్మ గారు,

బహుశా మీరు CAXM37500 మోడల్ ఉపయోగిస్తున్నారనుకుంటా!

మొదట మీ హార్డ్ డిస్క్ యొక్క పవర్ ఇండికేటర్ వెలుగుతుందో లేదో పరీక్షించండి. పవర్ ఇండికేటర్ వెలుగుతూ కూడా హార్డ్ డిస్క్‌ను మీ కంప్యూటర్‌కు కనెక్ట్ చేసినపుడు డిటెక్ట్ కావటం లేదు అంటే క్రింది కారణాలుండవచ్చు.

1. ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయడానికి మీరుపయోగిస్తున్న USB కేబుల్‌లో సమస్య ఉండి ఉండవచ్చు. ఆ కేబుల్‌ను ఇతర ఏ డివైజ్‌కైనా (కెమేరా లాంటి వాటికి) కనెక్ట్ చేసి చూడండి. అపుడు కేబుల్ పని చేస్తుంటే స్టెప్.2 లోకి రండి.

2. మీ కంప్యూటర్‌కు ఇతర USB డివైజ్‌లేమైనా (ప్రింటర్, మౌస్ ఇలాంటివి) కనెక్ట్ చేసి ఉన్నాయోమో చెక్ చేయండి. ఒకసారి వాటిని రిమూవ్ చేసి అదే పోర్ట్‌కు మీ హార్డ్ డిస్క్‌ను కనెక్ట్ చేసి చూడండి. (కొన్ని కంప్యూటర్స్‌లో కొన్ని సెట్టింగ్స్ వలన ఒక USB డివైజ్‌ను మాత్రమే డిటెక్ట్ చేయగలుగుతాయి.)

3. USB కంట్రోలర్స్ అన్నీ మీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇన్స్టాల్ అయి ఉన్నాయో లేదో చెక్ చేయండి. My Computer మీద రైట్ క్లిక్ చేసి >> Properties >> Hardware >> Device Manager లో చూడండి. USB కంట్రోలర్స్ డ్రైవర్స్ లిస్ట్ లో ఏదైనా పసుపు రంగు ప్రశ్నార్థకం కనిపిస్తే ఆ డ్రైవర్ మీ కంప్యూటర్లోకి లోడ్ కానట్లే.

4. కొన్ని USB డివైజ్‌లు, ఆ డివైజ్‌తో పాటు ఇవ్వబడిన సాఫ్ట్వేర్‌ను ఇన్స్టాల్ చేస్తేనే కంప్యూటర్లో ఆ డివైజ్‌ను డిటెక్ట్ చేయగలుగుతాయి. కాబట్టి అలాంటి సాఫ్ట్వేర్ ఏదైనా ఉంటే ఇన్స్టాల్ చేసి చూడండి.

5. మీరు కేబుల్ కనెక్ట్ చేసే USB పోర్ట్ లోపల డస్ట్ లాంటిది ఏదైనా ఉంటే క్లీన్ చేసి చూడండి.

అప్పటికీ పరిష్కారం కాకపోతే, మీరు కనెక్ట్ చేసినపుడు మీ కంప్యూటర్లో ఏదైనా మార్పులు జరుగుతుంటే తెలియజేయండి.

ధన్యవాదములు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5
rpsharma గారు

MahiGrafix గారు వివరించిన విధానం లో మీకు పరిష్కారం లభించవచ్చు. అలా కాని పక్షంలో మీరు My Computer పై రైట్ క్లిక్ చేసి అపుడు వచ్చిన పాప్ అప్ మెనూ లొ Disk Management లోకి వెళ్ళి Drive Letter లేకుండా మీ డ్రైవ్ కనపడుతున్నట్లైతే దానికి మీరు డ్రైవ్ లెటర్ ఇవ్వవలసి ఉంటుంది. క్రింది ఇమేజ్ లోని సోపానాలు చూసి చేయండి.

[Image: 2r217ch.jpg]

మరో విషయం ఏమిటంటే ఎక్కువ కెపాసిటి కలిగిన + ఎక్కువ RPM కలిగిన + తక్కువ పవర్ కలిగిన SMPS లతొ ఎక్స్టర్నల్ డ్రైవ్ కు USB ద్వారా లభించే విద్యుత్ సరిపోక కూడా అలా అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)