Post: #1
మైక్రోసాఫ్టు వర్డ్ డాక్యుమెంటులో ఇన్సెర్ట్ చేయబడిన ఇమేజిలను వేరు చేసి సేవ్ చేయడం ఎలాగో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం. ముఖ్యంగా పీ.హెచ్.డీ చేసే వారు తాము సేకరించిన సమాచారాన్ని సంబంధిత ఫోటోలతో సహా ఒకే డాక్యుమెంటులో వందల కొలది పేజీలలో పొందుపరుస్తుంటారు. అటువంటి డాక్యుమెంట్స్ నుండి ఒకేసారి అన్నీ ఇమేజిలను వేరు చేసి భద్రపరచడానికి ఈ టిప్ ఉపయోగపడుతుంది. వర్డ్ డాక్యుమెంటు నుండి ఇమేజిలను వేరు చేయడానికి ఆల్రెడీ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడిన కంప్రెషన్ టూల్స్ (విన్ జిప్, విన్ రేర్, 7జిప్) నుపయోగిస్తే చాలు. ఇప్పటికీ మీ కంప్యూటర్లో వీటిలో ఏ ఒక్కటీ లేకుంటే పూర్తి ఉచితంగా లభిస్తున్న 7జిప్ ను You are not allowed to view links. Register or Login to view. క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్కోండి. 7జిప్ ను మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.

క్రింది వర్డ్ డాక్యుమెంటును గమనించండి. మొత్తం నాలుగు ఇమేజిలు ఈ డాక్యుమెంటులో ఎంబెడ్ చేయబడి ఉన్నాయి. 7జిప్ నుపయోగించి వాటిని వేరు చేసి ఎలా సేవ్ చేయాలో తెలుసుకుందాం.

[Image: extractimagesfromword_1.jpg]

1. ఇమేజిలను ఎక్స్‌ట్రాక్ట్ చేయాలనుకుంటున్న వర్డ్ డాక్యుమెంటు మీద రైట్ క్లిక్ చేసి క్రింది చూపిన విధంగా 7-Zip >> Open Archive ను క్లిక్ చేయండి.

[Image: extractimagesfromword_2.jpg]

2. 7-zip విండోలో Word అనే ఫోల్డర్ మీద డబుల్ క్లిక్ చేసి, Media అనే ఫోల్డర్ ను ఓపెన్ చేయండి. ఆ డాక్యుమెంట్ లో ఎంబెడ్ చేయబడిన అన్నీ ఇమేజిలు అందులో లిస్ట్ చేయబడి ఉంటాయి. వాటిలో మీరు సేవ్ చేయాలనుకున్న ఇమేజిలను సెలెక్ట్ చేసి Extract బటను క్లిక్ చేయండి. తర్వాత ఆ ఇమేజిలు సేవ్ అవడానికి కావలసిన పాత్ ను సెలెక్ట్ చేస్కొని Ok బటన్ క్లిక్ చేయండి. అంతే, మీరు సెలెక్ట్ చేసిన అన్నీ ఇమేజిలు మీరు ఇచ్చిన పాత్ లో సేవ్ చేయబడతాయి.

[Image: extractimagesfromword_3.gif]

*విన్ జిప్, విన్ రేర్ సాఫ్ట్వేర్ల ద్వారా కూడా ఇదే పద్ధతిని ఉపయోగించి ఇమేజిలను ఎక్స్‌ట్రాక్ట్ చేయవచ్చు.

ఇక రెండో పద్ధతి: వర్డ్ డాక్యుమెంటును ఓపెన్ చేసి, Save as క్లిక్ చేసి Web Page ఫార్మాట్ లో సేవ్ చేస్తే అన్నీ ఇమేజిలు ఒక ఫోల్డర్ లోకి సేవ్ అవుతాయి.

[Image: extractimagesfromword_4.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
డియర్ ఫ్రెండ్
మంచి సమాచారాన్ని అందించినందుకు అభినందనలు.

పనిలో పని....!!

ఇలాగే రీసెర్చ్ చేసేవారికి కంపోజ్ చేసిన తరువాత ప్రూఫ్ నిమిత్తం ఇమేజెస్ తీసేసి కేవలం text మాత్రమే ప్రింట్ తీసుకునేటట్లు ఎలా చేయాలో వివరించండి...ప్లీజ్. (అంటే ఈ పద్ధతిలో ఇమేజెస్ యధాతథంగా ఉన్నా....కేవలం text మాత్రమే ప్రింటర్ లో ఫ్రింట్ వచ్చేటట్లు చేయడం మాత్రమే)

ఇది చాలా ఆవశ్యకం. మీరిచ్చే సమాచారం మీద కొన్ని చర్యలు ఆధారపడి ఉన్నాయి. తెలుపగలరు. ముందస్తు ధన్యవాదాలు.
Quote this message in a replyReply

Post: #3
Update:

In Word 2010 you can save image by Right Clicking on it. (I didn't remember that this facility is available in lower versions of Word).

[Image: 5a58f0.png]
(05-Jan-2011 01:28 PM)SV. Wrote: You are not allowed to view links. Register or Login to view.పనిలో పని....!!
ఇలాగే రీసెర్చ్ చేసేవారికి కంపోజ్ చేసిన తరువాత ప్రూఫ్ నిమిత్తం ఇమేజెస్ తీసేసి ....
[Image: c8e6c5.png]

You can use save as PlainText and take print out. But Formatting will be lost.
If there are few images you can select Text Only and choose print "Selected only" option.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)