Post: #1
గూగుల్ ను ఎక్కువగా ఉపయోగించేవారు బ్రౌజర్లలలో కొత్త విండోలలో గూగుల్.కాం ను ఓపెన్ చేసి సెర్చ్ చేయకుండా అంతర్గతంగా ఉన్న సెర్చ్ టూల్స్ నుపయోగించి సులువైన పద్ధతిలో చాలా వేగంగా వారికి నచ్చిన సెర్చ్ ఇంజిన్ లో సెర్చ్ చేయవచ్చు. (ఈ పద్ధతి చాలా మందికి తెలిసే ఉంటుంది. కొత్తగా ఇంటర్నెట్ ఉపయోగించేవారి కోసమే ఈ టిప్)

ఫైర్ ఫాక్స్ ఉపయోగించే వారికి: బ్రౌజర్ లో టాప్ రైట్ సైడ్ గమనించండి. [Image: 10800671.jpg] చిన్న సెర్చ్ బాక్స్ ఉంటుంది. మీరు సెర్చ్ చేయాలనుకున్న పదాన్ని ఈ సెర్చ్ బాక్స్ లో టైప్ చేసి, ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు. మీరు ప్రస్తుతం ఉన్న విండోలో సెర్చ్ రిజల్ట్స్ ఓపెన్ అవుతాయి. అయితే ఈ సెర్చ్ బాక్స్ ఏ సెర్చ్ ఇంజిన్ కు కనెక్ట్ అయి ఉండాలి అనేది కూడా మీరే చాలా సులభంగా కన్ఫిగర్ చేయవచ్చు. క్రింది ఇమేజిలో గమనించండి.
[Image: managesearchengine.gif]
అంతే కాదు, Manage Search Engines ఆప్షన్ ను క్లిక్ చేసి కొత్త సెర్చ్ ఇంజిన్ లను యాడ్ చేయవచ్చు.

గూగుల్ క్రోమ్ ఉపయోగించే వారు: జనరల్ అడ్రస్ బార్ లో ఏదైనా పదము టైప్ చేస్తుంటేనే గూగుల్ సెర్చ్ డైలాగ్ కనిపిస్తుంది. క్రింది ఇమేజిలో గమనించండి.
[Image: gsearch.jpg]
గూగుల్ క్రోమ్ లో కూడా సెర్చ్ ఇంజిన్ ను సులభంగా మార్చుకోవచ్చు. క్రింద చూపిన విధంగా అడ్రస్ బార్ మీద రైట్ క్లిక్ చేసి Edit Search Engines క్లిక్ చేసి మీకు కావలసిన సెర్చ్ ఇంజిన్ ను సెలెక్ట్ చేస్కోవచ్చు.
[Image: editsearchengines.jpg]

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
When user to use a net. So sometime to find a word of his information. So many goggle not complied word to before his word name given it. So like as a tool name his Goggle to enter name auto. So auto related to keyword information to given it.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)