Post: #1
Windows 7 లో Bitlocker feature యొక్క ఉపయోగము మరియు అది ఎలా ఉపయోగించాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం!

సాధారణంగా మన సిస్టం లోని ఏదైనా ముఖ్యమైన ఫైల్ లేదా ఫోల్డర్ ని ఇతరులు ఓపెన్ చేయకుండా folderlocker లేదా మరేదైనా సాఫ్ట్వేర్ ను ఉపయోగించి లాక్ చేస్తుంటాం.
Windows 7 లో Bitlocker అనే ఫీచర్ ద్వారా ఒక డ్రైవ్ లేదా పార్టీషన్ ను పాస్వర్డ్ ద్వారా encrypt చేసి ఇతరులనుండి ప్రొటెక్ట్ చేయొచ్చు.దానివలన ఆ డ్రైవ్ లో ఫైల్స్ లాస్ అవడం లేదా హ్యక్ అవడం జరగదు.

*ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం!

1.మీరు ఏ డ్రైవ్ లాక్ చేయాలనుకుంటున్నారో ఆ డ్రైవ్ పై రైట్ క్లిక్ చేసి క్రింది ఇమేజ్ లో చూపించినట్టుగా Turn on Bitlocker ను క్లిక్ చేయండి లేదా start>controlpanel>system and security>Bitlocker drive encryption ద్వారా కూడా చేయొచ్చు.

[Image: 69526887.jpg]

2.ఆ తరువాత వచ్చిన విండోలో Use a password to unlock the drive ను టిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేశాక next క్లిక్ చేయండి.

[Image: 79027138.jpg]

3.నెక్స్ట్ విండోలో save the recovery - to a file ను క్లిక్ చేసి next కొట్టండి.ఫైల్ ను సిస్టం లో ఎక్కడైన సేవ్ చేయండి.

[Image: 35029836.jpg]
[Image: 11187086.jpg]
[Image: 74905201.jpg]

4.ఆ తరువాత విండోలో startencrypting ను క్లిక్ చేయండి.డ్రైవ్ పూర్తిగా encrypt అయ్యాక ఆటోమేటిక్ గా మీ డ్రైవ్ లాక్ చేయబడుతుంది.

[Image: 56271847.jpg]
[Image: 59653881.jpg]

ఎప్పుడైనా డ్రైవ్ ను ఓపెన్ చేయాలంటే మొదట మీరు ఇచ్చిన పాస్వర్డ్ ఇవ్వాలి.

ఈ ఫీచర్ ను మీరు హార్డ్ డిస్క్ డ్రైవ్స్ కు మాత్రమే కాకుండా USB storage drives కు కూడా ఉపయోగించొచ్చు.

*ఈ ఫీచర్ ను డిసేబుల్ చేయండం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం!

1.start>controlpanel>system and security>Bitlocker drive encryption లోకి వెళ్ళి ఈ క్రింది ఇమేజ్ లో చూపించినట్టుగా Turnoff bitlocker ను క్లిక్ చేయండి.

[Image: 24318887.jpg]
[Image: 63257921.jpg]
[Image: 80127985.jpg]
[Image: 73288789.jpg]

2.ఆ తరువాత వచ్చిన విండొలో Decrypt drive ను క్లిక్ చేయండి.

[Image: 24958234.jpg]
[Image: 97504092.jpg]
[Image: 75026312.jpg]

3.Decrypting పూర్తయ్యాక మీ డ్రైవ్ unlock అవుతుంది.
Quote this message in a replyReply

Post: #2
శ్రీనాధ్ గారు,
విండోస్ 7 లో అంతర్గతంగా ఉన్న Bitlocker ఫీచర్ ను ఎలా ఉపయోగించుకోవాలో చాలా వివరంగా ఉపయోగకరమైన పోస్టు చేశారు. ధన్యవాదములు.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
You are not allowed to view links. Register or Login to view.
Windows 7 Home Premium lo ee option ledu :-(
Quote this message in a replyReply

Post: #4
అదీ బేసిక్ వెర్శన్ కదా.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)