Post: #1
సమయం ఉదయం ఏడు గంటలు
రోజూలాగానే నడుస్తున్నాను ఆ రోడ్డుపై
గమ్యం తెలియకుండ!

అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..

హటాత్తుగా నువ్వు గుర్తుకొచ్చి
బాధపడ్తూ నవ్వుకొంటున్నాను
మోక్షమార్గం గురించి ఆలోచిస్తూ,
దారికై వెతుకుతున్నాను
అటూ ఇటూ…

అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..

చిన్నపుడు
నాతో పాటు ఆడుకున్న
మిత్రులు గుర్తుకొచ్చారూ
ఎక్కడున్నారో వారంతా ??

అనుమానమొచ్చి
వెనక్కి తిరిగి చూసా
ఎవరూ లేరు..

చీకట్లో వెలుగొచ్చినట్లు
ఆలోచనల్లోంచి తెరలు తెరలుగా
ఒక పూవు రెక్కలువిప్పి విచ్చుకొంటునట్లుగా
నాలోంచి నేను వీడిపోతూ …

నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను
నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను
నడుస్తున్నాను నడుస్తున్నాను నడుస్తున్నాను

నడుస్తునే ఉన్నాను.. కళ్ళు మూసుకుని.
నడక పరుగై

హటాత్తుగా నా పాదాలు గాలిలో
ఎక్కడికో జారిపోతున్నాను

లాలి పాటలు అమ్మ గుర్తుకొస్తు
నా కళ్ళలోంచి నీళ్ళూ.

ఉలిక్కిపడి లేచి చూస్తే
కుక్కి మంచంలో నేను
పక్కనే ఆరిపోతూ బిక్కు బిక్కుమంటున్న కొవ్వొత్తి.

ఆ రాత్రి మళ్ళీ నిద్దర్రాలేదు…

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #2
Quote:చీకట్లో వెలుగొచ్చినట్లు
ఆలోచనల్లోంచి తెరలు తెరలుగా
ఒక పూవు రెక్కలువిప్పి విచ్చుకొంటునట్లుగా
నాలోంచి నేను వీడిపోతూ …
Quote:ఉలిక్కిపడి లేచి చూస్తే
కుక్కి మంచంలో నేను
పక్కనే ఆరిపోతూ బిక్కు బిక్కుమంటున్న కొవ్వొత్తి.


వావ్...ఏం చెప్పారండీ..
మీ కవిత, కవితలోని భావావేశం హృదయాన్ని స్పందిపంజేస్తుంది.
ఇలాంటి మరిన్ని మంచి కవితలు మీ నుంచి రావాలని ఆశిస్తూ...

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
డియర్ మహేష్,

తప్పకుండా సర్
మీ కాంప్లిమెంట్ కు ధన్యవాదాలు!!

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #4
meeke kaadu maakuuuuuuu nidra raaledu. mee kavitha chadivina tharuvatha chala baga vundi. Bhavavesham arikattadam chala kastam. Nijame. Good Poetic manner. Keep it up sir.
Quote this message in a replyReply

Post: #5
సుమనీవెంకట్ గారు !!

ధన్యవాదాలు. మీ పోస్ట్ లను, మీ రెప్లై లను గమనిస్తూనే ఉన్నాను బాగుంటాయి.

మీ కాంప్లిమేంట్ కు మరొక్కసారి ధన్యవాదాలు సుమన్.


అది సరే మీ పేరుపక్కన గుర్రానికి కాస్త విశ్రాంతినివ్వండి సార్ Smile

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)