Post: #1
ఫోరమ్ లో పోస్టు చేయడం చాలా సులభం Smile

మీరు ఏ విషయం మీద పోస్టు చేయాలనుకుంటున్నారు?

ఉదా:కు ఫోటోషాప్ గురించి పోస్టు చేయలనుకుంటున్నారు.

ఫోటోషాప్ అంటే మల్టీమీడియాలో ఒక భాగమే కదా!

మరి వెంటనే మల్టీమీడియా కేటగిరీలో ఫోటోషాప్ సబ్ కేటగిరీ కోసం వెతకండి.

కనిపించిందా?

కనపడలేదా!

అయితే ఇక్కడ చూడండి.

[Image: 16hkxt1.jpg]

హ ఓకే ఇప్పుడు కనిపించింది కదా!

మరి ఇప్పుడేం చేస్తారు. పై పటంలో చూపిన విధంగా క్లిక్ చేయండి.

ఆగండాగండి!

మీరు ఫోటోషాప్ గురించి ప్రశ్న వేయాలనుకున్నారా? మీకు తెలిసిన విషయం పోస్టు చేయాలనుకున్నారా?

ముందు డిసైడ్ చేస్కోండి.

మీకు తెలిసిన విషయం పోస్టు చేయాలనుకున్నారా?

అయితే పైన పటంలో చూపిన విధంగా క్లిక్ చేయండి.

ఒక వేళ మీరు వేయాలనుకున్నది ప్రశ్నే అయితే?

(వెరీ సింపుల్. ప్రతీ కేటగిరీకి చివర్లో ప్రశ్నలు- సమాధానాలు అని సబ్ కేటగిరీ ఉంటుంది. గమనించారా!)

మీరు ఫోటోషాప్ గురించి ప్రశ్న వేయాలనుకుంటున్నారు కాబట్టి, ఫోటోషాప్ మల్టీమీడియాకు సంబంధించినది కాబట్టి, పైన పటంలో చూడండి. మల్టీమీడియా కేటగిరీలో అడుగున ఉన్న ప్రశ్నలు- సమాధానాలు ను క్లిక్ చేయండి.

హమ్మయ్య! ఎట్టకేలకు మీరు అనుకున్న సబ్ ఫోరమ్ లోకి ఎంటర్ అయారు.

ఇక పోస్టు చేయడమే లేటు.

మరి పోస్టు చేయాలంటే ఏ బటన్ క్లిక్ చేయాలా? అని వెతుకుతున్నారా?

అదిగోండీ! ఇక్కడ, ఇటువైపు కుడి ప్రక్కన NEW THREAD బటన్ కనిపిస్తుందా?

కనపడలేదా!

అయితే ఇక్కడ చూడండి.

[Image: 162utc.jpg]

హ అదేనండి! ముందు దాన్ని క్లిక్ చేయండి.

ఇప్పుడు మీరు పోస్టు చేయడానికి ఒక పోస్టు ఎడిటర్ కనిపిస్తుంది.

ఇక మీరు చేయాలనుకున్న మ్యాటర్ టైప్ చేయడమే. ఎలాగా అని ఆలోచిస్తున్నారా?

ఇలాగ!

[Image: 2rh4hzk.jpg]

ఏదైనా టెక్స్ట్ కు సైజ్, కలర్ లేదా ఏ మోడిఫికేషన్ చేయాలన్నా ముందు ఆ టెక్స్ట్ వరకు సెలెక్ట్ చేయండి. తర్వాత మోడిఫికేషన్ బటన్స్ ను క్లిక్ చేయండి. ఏంటీ అర్థం కాలేదా?

ఏంలేదండి! టెక్స్ట్ సైజ్ మార్చాలనుకోండి. ఏ టెక్స్ట్ సైజ్ మార్చాలనుకున్నారో ఆ టెక్స్ట్ ను ముందు మౌస్ తో సెలెక్ట్ చేయండి. తర్వాత సైజ్ ను అప్లై చేయండి.

(మీ కంప్యూటర్లో ఉన్న ఇమేజిని ఎలా insert చేయాలో ఈ ట్యుటోరియల్ లో చూడండి. You are not allowed to view links. Register or Login to view.

మరి మీరు పోస్టు ఎడిటర్ లో అనుకున్న మోడిఫికేషన్స్ అన్నీ చేశారా?

అయితే ఇక పోస్టు ఎడిటర్ ను క్రిందకు స్క్రోల్ చేయండి. అక్కడ మూడు బటన్స్ కనిపిస్తాయి.

కనపడలేదా!

అయితే ఇక్కడ చూడండి.

[Image: 2jflh0y.jpg]

Post Thread : ఈ బటన్ ను క్లిక్ చేస్తే, మీరు ఇప్పటి వరకు పోస్ట్ ఎడిటర్ లో చేసిన మ్యాటర్ డైరెక్టుగా ఫోరమ్ లో పబ్లిష్ అవుతుంది.

Preview Post: ఈ బటన్ ను క్లిక్ చేస్తే, మీరు ఇప్పటి వరకు పోస్ట్ ఎడిటర్ లో చేసిన మ్యాటర్ డైరెక్టుగా ఫోరమ్ లో పబ్లిష్ అవకుండా ప్రివ్యూ చూడొచ్చు. నచ్చితే Post Thread బటన్ ను క్లిక్ చేయొచ్చు.

Save as Draft: టైం సరిపోక సగం పోస్టే టైప్ చేశారనుకోండి. ఈ బటన్ ను క్లిక్ చేసి టైప్ చేసిన వరకు సేవ్ చేయవచ్చు. మళ్లీ మీకు టైం దొరికినపుడు User cp లోకి వెళ్లి అక్కడ Saved Drafts ను క్లిక్ చేసి మిగిలినది కంప్లీట్ చేయొచ్చు.

ఈ మూడింటిలో ఏ బటన్ క్లిక్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? మీ అవసరాన్ని బట్టి క్లిక్ చేయండి.

మరి పోస్టు ఎలా చేయాలో అర్థం అయ్యిందా?

సగమే అర్థం అయిందా!

మిగిలినది మీరు పోస్టు చేసేటపుడు అర్థం అవుతుంది లేండి!

ఇక పోస్టులు చేసేయండి మరి!

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
చాలా మంచి పోస్ట్ చేసారు.ఇది నాలాంటి కొత్తవారికి చాలా ఉపయోగపడుతుంది

ThanQ....
Quote this message in a replyReply

Post: #3
వావ్ శ్రీనాధ్ గారు,

అప్పుడే తెలుగు నేర్చుసుకున్నారా? రియల్లీ గ్రేట్.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #4
Ee Post Andariki Upayokaram ga Vuntundi. Vunnadi.

Andariki Upayogapade post chesaru. Dhanyavaadalu.

Really........GOOD IMPRESSIVE, RESULT ORIENTED POST
Quote this message in a replyReply

Post: #5
Dear Kr.Kumar,

As our Forum rules you should not post this type of advertisements in Our Forum. Read these threads to Increase your awareness on our forum attitudes.

You are not allowed to view links. Register or Login to view.

You are not allowed to view links. Register or Login to view.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)