Post: #1
Install Block అనే సాఫ్ట్ వేర్ ద్వారా మనం మన సిస్టం లొ మన అనుమతి లేకుండా ఇతరులు సెట్టింగ్స్ మార్చటం, అనవసర మైన ప్రోగ్రాం లను ఇనస్టాల్ చేయటం వంటి వాటిని నిరోధించవచ్చు లేదా నియంత్రించవచ్చు. అదెలాగో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం. సాఫ్ట్ వేర్ వివరాలకు క్రింది బ్యానర్ పై క్లిక్ చేయండి

[Image: IBlogo.gif] You are not allowed to view links. Register or Login to view.

Install Block ఉపయోగించే విధానం:

మీరు ఈ సాఫ్ట్ వేర్ ను ఇనస్టాల్ చేసిన తర్వాత ఇది దానంతట అదే లోడ్ అవుతుంది.

ఒకవేళ మీ ఫైర్ వాల్ ఏదైనా ప్రాంప్ట్ చేస్తే తదనుగుణంగా మీ అవసరాలను బట్టి నెట్ వర్కింగ్ ఫీచర్స్ ను ఎంచుకుని ప్రోగ్రాం ను అనుమతించండి. మీ సిస్టం ట్రే (నోటిఫికేషన్ ఏరియా) లొ ఈ సాఫ్ట్ వేర్ యొక్క ఐకాన్ మీకు కనపడుతుంది.
[Image: 397478aa.gif] [Image: 5862c324.gif]

ముందుగా మీరు ఆ ఐకాన్ పై రైట్ క్లిక్ చేసి సెట్టింగ్స్ లో మీకు కావలసిన విధంగా సెట్ చేసుకోండి.
ఇపుడు మీకు పాస్ వర్డ్ ను ఎంటర్ చేయమని ఒక విండో వస్తుంది. దానిలోనే క్రింద బ్లూ కలర్ లో డిఫాల్ట్ పాస్ వర్డ్ కనపడుతుంది. దానిని టైప్ చేసి ఓకె చేయండి. ఇక్కడ ఉన్న డిఫాల్ట్ పాస్ వర్డ్ admin

[Image: 3f1d93e4.gif]

ఇపుడు మీకు Config విండో వస్తుంది. ఇక్కడ మనం మన స్వంత పాస్ వర్డ్ లను సెట్ చేసుకుంటాం. దాని కొరకు ముందుగా మొనూ లోని ఎడమ భాగం లొ ఉన్న General టాబ్ ను క్లిక్ చేయండి.

[Image: 2a7ba06e.gif]

ఇపుడు Config option సెలెక్ట్ అయి ఉన్న Change Passwords డైలాగ్ బాక్స్ వస్తుంది. మీరు మీ స్వంత పాస్ వర్డ్ సెట్ చేసుకోవటానికి వీలుగా క్రింద ఉన్న Change Password బటన్ ను క్లిక్ చేయండి.
[Image: 5d4788e6.gif]

ఇపుడు మీకు క్రింది డైలాగ్ బాక్స్ వస్తుంది. దానిలో మీ పాస్ వర్డ్ ను టైప్ చేసి, కన్ఫర్మ్ చేయండి. తర్వాత Save బటన్ ను క్లిక్ చేయండి. పాస్ వర్డ్ మారినట్లు చూపిస్తూ ఒక బాక్స్ వస్తుంది. దానిని ఓకె చేసిన తర్వాత మరల పై డైలాగ్ బాక్స్ (ఇంతకు ముందు స్క్రీన్) లోకి వస్తాము.
[Image: fb36198c.png] [Image: f05bc582.png]

దీని ద్వారా మనం Config window కు యాక్సెస్ కావటానికి లేదా Install-Block ను అన్ లోడ్ చేయటానికి లేదా డిజేబుల్ చేయటానికి ఉపయోగిస్తాము.
ఇపుడు మీరు Inblock ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి. దీనిలొ డిఫాల్ట్ పాస్ వర్డ్ password. పై విథానం లోనే మీరు మీ స్వంత పాస్ వర్డ్ ను సెట్ చేసుకోండి. దీని ద్వారా మనం ఏదైనా ఒక ప్రోగ్రాం కు యాక్సెస్ ను నియంత్రించవచ్చు. తదుపరి మీరు Done బటన్ నొక్కి ఈ ప్రక్రియను పూర్తిచేయండి.

మీరు Config కు Unblock కు ఒకే పాస్ వర్డ్ ఉపయోగాంచుకోవచ్చు. ఇది మీరొక్కరే లేదా చిన్న చిన్న ఆఫీస్ ల లో వలె అనుమతించబడిన కొద్దిమంది మాత్రమే ఆ సిస్టం ను వినియోగించే సందర్భాలలో సరిపోతుంది. కాని ఇంటర్నెట్ సెంటర్లు, పెద్ద పెద్ద ఆఫీస్ ల లొ వేరే వేరే పాస్ వర్డ్ లు సెట్ చేసుకోవటం వలన Config పాస్ వర్డ్ ద్వారా సిస్టం యాక్సెస్ వరకు మాత్రం అనుమతించి Unblock పాస్ వర్డ్ ద్వారా ఇతర ప్రోగ్రాం లను అనుమతి లేకుండా ఇనస్టాలేషన్ చేసే ప్రక్రియ ను నిరోధించవచ్చు.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)