Post: #1
భూమిని వెనక్కు తోసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న రైలుబండికంటే వేగంగా నా మనసు గమ్యాన్ని చేరుకుంటోంది. ప్రియురాలి జడలోని సన్నజాజుల పరిమళం నా నాసికకు తాకుతున్న అనుభూతి. తన మునివేళ్ళ మృధుత్వం నా చేతివేల్ల చిగుర్లలో పాకుతోంది. సూపర్ సోనిక్ వేగంతో తన ఒడిలో వాలాలన్న తీరని కోరికతో రెక్కలల్లర్చుకుంటూ నింగిలోకి ఎగిసే పక్షిలా నా భుజాలను మాటిమాటికీ కదుపుతూన్నా! అనకొండలాంటి త్రైన్ కడుపులో ఒక కిటికీ మూల పదకొండో నెంబరు సీటులో నేను....
Quote this message in a replyReply

Post: #2
కవితా సమీరాల్లోనికి మీకు స్వాగతం కుమార్ వర్మ గారు !!

బాగుంది మీ కవిత !!
మీ గమ్యాన్ని తప్పక చేరుకుంటారు కొంచం ఓపిక పట్టండి !!
మీలోని భావాన్ని వ్యక్తీకరించడం లో మీరు సఫలీకౄతులయ్యారు ..

ఆల్ ద బెస్ట్ కుమార్ వర్మ గారు

REL
You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)