Post: #1
వాసుదేవ -- వసుదెవస్య అపత్యం వాసుదేవ
తా - వసుదేవుని కొడుకు వాసుదేవ,అనగా కృష్ణుడు .

మాధవ -- మా అంటే లక్ష్మి,ధవ - భర్త .లక్ష్మియొక్క భర్త అని.


కేశవ --a) సంస్క్రుతంలో కేశ అంటే జుట్టు.ఎవరికైతే సుందరమైన,పొడవాటి జుట్టు కలవాడో ఆతను కేశవ.
b) "కేశి" అను అసురుడు(రాక్షసుడిని) చంపుటచే కేశవ అయ్యెను, ఇతను ద్వాపర యుగంలొ ఉండెను.

కృషిశ్చ పరమానందే ణశ్చ తద్దాస్యకర్మణి
తయోర్దాతా చ యో దెవస్తేన కృష్ణ ప్రకీర్తితః (బ్రహ్మ వైవర్త పురాణం)
తాత్పర్యం -- కృష్-అనగా పరమ(మహా)ఆనందము ; ణ - అతని దాస్యము(సెవ),ఈ రెండెంటిని ఇచ్చువాడె కృష్ణ భగవానుడు.

విష్ణు -- "విశ్లు" అనె ధాతువునుండి ఈ శబ్దం వచ్చింది అర్థం - వ్యాప్తౌ
తా - సర్వం (అంతటా) వ్యపించి వున్నవాడు విష్ణు

రమయతి ఇతి రామః
తా- సుఖింప చెయువాడు రామ

గాం విందతి ఇతి గొవింద
తా - ఆవులకు, ఇంద్రియాలకు ఆనందము ఇచ్చువాడు .

హరి -- హరమ్యఘం స్మర్తృణాం .... తస్మాద్ హరిర్ అహం స్మృతః (మహాభరతం)
తా - నాపై ధ్యానించుట వలన పాపాలను హరిస్తాను (నాశనం చెయును) కనుక నెను "హరి" అని అనబడ్దాను .


-----------k.harikrishna -tirupati

Thread Closed 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)