Post: #1
పేజ్ మేకర్ ట్యుటోరియల్స్

బుక్స్ ప్రింటింగ్ కోసం సహజంగా మాస్టర్ పేజెస్ ను వాడుతుంటారు. మాస్టర్ పేజెస్ క్రియేషన్, మాస్టర్ పేజెస్ మార్జిన్ అలైన్ మెంట్స్ మరియు మాస్టర్ పేజెస్ లో పేజి నంబర్స్ ఎలా ఇన్సెర్ట్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

మాస్టర్ పేజి క్రియేషన్

1. File >> New ను క్లిక్ చేసి Document Setup విండోలో ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేసి ok బటన్ ను క్లిక్ చేయండి.

[Image: 2rcbbj7.jpg]

2. క్రింద చూపిన విధంగా పేజి ఐకాన్ మీద రైట్ క్లిక్ చేసి Add Two Pages ను క్లిక్ చేయండి. ఇపుడు కొత్తగా Left page మరియు Right Page ఏర్పడతాయి. ఇక మాస్టర్ పేజెస్ లో మీకు కావలసిన మ్యాటర్ ను టైప్ చేస్కోండి.

[Image: oset0m.jpg]

[Image: 2mnoy8y.jpg]

మాస్టర్ పేజి మార్జిన్ అలైన్మెంట్స్

1. Window >> Show Master Pages ను క్లిక్ చేయండి.
[Image: 5triti.jpg]

2. ఈ క్రింది విధంగా మాస్టర్ పేజి లేయర్స్ కనిపిస్తాయి.

[Image: 30ifj4g.jpg]

3. ఇపుడు Document Master లేయర్ మీద డబుల్ క్లిక్ చేసి Master Options లో ఈ క్రింది స్ట్రక్చర్ ను గమనించి మీకు కావలసిన విధంగా Inner Margin, Outer Margins సెట్ చేస్కోండి.

[Image: 14xyt82.jpg]

మాస్టర్ పేజెస్ లో పేజి నంబర్స్ ఇన్సెర్టింగ్

మొదట Left Page లో మీరు ఎక్కడ పేజ్ నంబర్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ టైప్ టూల్ తో క్లిక్ చేసి Ctrl+Alt+P లేదా Ctrl+Shift+3 ని ప్రెస్ చేయండి. ఆ పేజ్ నంబర్ అక్కడ క్రియేట్ అవుతుంది.

తర్వాత Right Page లో కూడా ఇలాగే క్రియేట్ చేయండి.

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #2
Excellent....Mahi garu....

సచిత్రాలతో....సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. బహుళ ప్రయోజనాన్ని ఆశించే సభ్యులకు మీ నుంచి వచ్చే ప్రతి అంశం ఒక్కొక్క ఆణిముత్యంలాంటిది. గో ఎ హెడ్.
Quote this message in a replyReply

Post: #3
మహేష్ గారు,

చాలా బాగుంది, మీ స్టైల్ ఆప్ ట్యుటోరియల్స్ ప్రత్యేకత మరొక్కసారి చూపించారు, కంటిన్యూ సర్. ఇలాగే కోరెల్ డ్రా కూడా మీ నుంచి ఆశిస్తున్నాను, అపుడు డి.టి.పి లొని 3 ముఖ్యమైన (పేజ్ మేకర్, ఫొటోషాప్, కోరెల్ డ్రా) వాటిని మొదలు పెట్టినట్లవుతుంది, తర్వాత క్వార్క్ ఎక్స్ప్రెస్, ఫ్రీ హాండ్ లాంటివి స్టార్ట్ చేయవచ్చు, అపుడు ఈ ఫోరం పేరు సార్ధకమవుతుంది.
Quote this message in a replyReply

Post: #4
ప్రసాద్ గారు,

మీరు చెప్పినట్లుగా డీటీపీ కి సంబంధించిన అన్నీ ముఖ్యమైన సాఫ్ట్వేర్ల (Page maker, Corel Draw, QuarkXpress) ట్యుటోరియల్స్ త్వరలోనే పోస్ట్ చేస్తాను..థాంక్యూ

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #5

మాస్టర్ పేజెస్ గురించి చాలా బాగా వివరించారు సర్. thanx

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)