Post: #1
బ్లాగ్ ను ఆఫీసు నుంచే నిర్వహించవచ్చు....


ఏమిటీ...టైటిల్ విచిత్రంగా ఉందని చూస్తున్నారా...?


అంతేనండీ...అంతే...మనం రోజువారీ కార్యకలాపాలలో ఒక్కొక్కసారి ఆఫీసులోనే ఎక్కువ సమయం గడుపుతాము కదా ఆ సమయంలో కొద్దిసేపు కూడా (విశ్రాంతి సమయంలో) బ్లాగ్ నిర్వహించేవాళ్ళు కూడా ఉంటారు.


అసలు విషయంలోకి వస్తే....

మైక్రోసాఫ్ట్ యంయస్.ఆఫీసు 2007 వెర్షన్ విషయంలోకి వెళదామా....ఎందుకంటే...బ్లాగ్ ని ఆఫీసు నుంచే నిర్వహించవచ్చని తెలుసుకుంటున్నారు కదా....

మైక్రోసాఫ్ట్ యంయస్.ఆఫీసు 2007 వెర్షన్ లో అద్భుతమైన ఫీచర్ ఒకటి పొందు పరచబడి ఉంది. అది ఏమిటనగా....సాధారణంగా అందరూ (ఏదో కొద్దిమంది మినహాయించి) బ్లాగ్ లో పోస్ట్ లు చేయటానికి You are not allowed to view links. Register or Login to view. సైట్ కి వెళ్ళి వారి వారి యూజర్ నేమ్, పాస్ వర్డ్ తో లాగిన్ అయి న్యూ పోస్ట్ అయితే న్యూ పోస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పోస్ట్ చేస్తుంటారు. లేదా ఎడిటింగ్ వగైరా వగైరా చేస్తుంటారు కదా. ఇది ఒక పద్ధతి.

ఇంకొకటి. మనం You are not allowed to view links. Register or Login to view. సైట్ కి వెళ్ళకుండానే మైక్రోసాఫ్ట్ యంయస్.ఆఫీసు 2007 వెర్షన్ లో లభించే blog ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వర్డ్ లోనే మనం పోస్ట్ చేయాల్సిన విషయాన్ని కంపోజ్ చేసి చివరగా పోస్ట్ అని క్లిక్ చేస్తే....ఆటోమేటిక్ గా మీరు వ్రాసిన విషయం పబ్లిష్ అవుతుంది.

అంతటితో మనం ఆ రోజు పోస్ట్ ను విజయవంతంగా ముగించినట్లే.

మరిన్ని వివరాలకు.....



[Image: 2h2obw9.jpg]


[Image: 2cib2id.jpg]


[Image: 29vfp6h.jpg]


[Image: 2aifsox.jpg]


[Image: 346vvp5.jpg]

ఇక్కడ మీరు కావాలంటే మీ యొక్క ఇమేజ్ ని కూడా అప్ లోడ్ చేసి పెట్టుకోవచ్చు.

[Image: 2z40n68.jpg]

ఇక్కడ మీరు పోస్ట్ చేయాల్సిన విషయాన్ని కంపోజ్ చేసేయటమే....

[Image: 2n7nw9f.jpg]


ఇక్కడ చూపిన విధంగా మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి.

(గమనిక : ఆఫీస్ ను ఆఫీసుగానే చూసుకుందాం. మన విధులను మరిచి వేరే పనులు చేయకూడదు సుమా. కానీ కళాతృష్ణ అనేది ఏ ఒక్కరిని నిలకడగా ఉండనివ్వదు కదా....అందుకు సాంకేతికతను మంచి పనులకు ఉపయోగిస్తే సరి....చదివినందుకు ధన్యవాదాలు.)Smile
Quote this message in a replyReply

Post: #2
సుమణీ వెంకట్ గారు,

చాలా అద్భుతమైన పోస్ట్ మరియు స్క్రీన్ షాట్స్ తో చాలా వివరంగా మరియు చాలా మందికి తెలియని విషయాన్ని తెలియ చేసి మీ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇలాంటి ఎవెర్ గ్రీన్ పోస్టులను మీ నుంచి మరిన్ని ఆశిస్తూ......మహిగ్రాఫిక్స్

[Image: mahi_sig.jpg]
Quote this message in a replyReply

Post: #3
ఈ పోస్ట్ ను చూసిన తరువాత మరిన్ని మంచి బ్లాగ్స్ తెలుగువారి కోసం వస్తాయన్న నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే అందరికి సులువుగా ఆఫీసులోనే బ్లాగ్ చేసుకొనే విషయాన్ని తెలిసుకొని వారి ఆలోచనలను బ్లాగ్ రూపంలో మొదలు పెడతారు. అందుకని మరిన్ని మంచి బ్లాగ్ లు త్వరలోనే వస్తాయి.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)