Post: #1
సభ్యులందరికి నమస్కారం.
నాకొక చిన్న సందేహం?
పాన్ కార్డ్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయాలా?
మరి ఆదాయపు పన్ను పరిది లొకి రాని వారి పరిస్తితి ఏమిటి?

పూర్తి వివరాలు తెలియజేయగలరని ఆసిస్తున్నాను.
Quote this message in a replyReply

Post: #2
మీ సంవత్సర ఆదాయం ఆ సంవత్సరపు బేసిక్ మినహాయింపును దాటి ఉంటే మీరు మే 31 వ తేది లోపు PAN కొరకు దరఖాస్తు చేయాలి. ఉదాహరణకు ఈ ఆర్ధిక సంవత్సరం (2011-12), అంటే 01.04.2011 నుండి 31.03.2012 వరకు మీ ఆదాయం బేసిక్ పరిమితి అయిన రూ. 1,80,000/- దాటి ఉంటే మీరు ఈ అసెస్మెంట్ సంవత్సరం ( 2012-13 గా పరిగణిస్తారు) లోని 31.05.2012 తేది నాటికి PAN కొరకు దరఖాస్తు చేయాలి.
అదే విధంగా ఏ వ్యక్తి అయినా లేదా నిర్దేశించబడిన చాటిటబుల్ ట్రస్ట్ తన టర్నోవరు లేదా మొత్తం రిసీట్ (ధన ఆదాయం) లు రూ. 5,00,000/- మించితే సంబంధిత ఎకౌంటింగ్ సంవత్సరం లోపు PAN కు దరఖాస్తుచేయాలి.
అలాగే fringe benefits ను ఇచ్చే యాజమాన్యాలు PAN కు దరఖాస్తు చేయాలి. కాని ఫలానా తేది లోపు అని ఎక్కడా నిర్దేశించబడలేదు.

ప్రస్తుతం రూ. 50,000/- దాటిన ప్రతి ట్రాన్సాక్షన్ కు PAN నంబరు ఇవ్వటం తప్పని సరి చేయబడింది. అనేక సందర్భాలలో ఫొటో ఐడెంటిటీకి ఈ కార్డ్ అడుగుతున్నారు. కాబట్టి ఇది తీసుకోవటం చాలా అవసరం గా కనపడుతుంది. మీరు PAN కలిగి ఉన్నంత మాత్రాన మీరు ఇన్కంటాక్స్ కట్టవలసిన అవసరం లేదు. PAN మీకు లేకపోతే మీరు ట్రాన్సాక్షన్ల సమయంలో Form 60 లేదా Form 61 (వ్యవసాయదారులైతే) సమర్పిస్తే సరిపోతుంది (బ్యాంక్ అధికారుల సంతృప్తి మేరకు). ఇలా రాసుకుంటూ పోతే PAN గురించి చాలా వ్రాయాల్సి ఉంటుంది. బేసిక్ సమాచారం వరకు మాత్రం ఇది సరిపోతుంది.
Quote this message in a replyReply

Post: #3
Good imformation it's very helpful.......
Thank you sir
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)