Post: #1
మిత్రులారా...!!

నానాటికీ మక్కువ పెరుగుతున్న మల్టీమీడియా రంగంలో వచ్చే నూతన సాంకేతికతను ఒడిసి పట్టుకొని వాటిని బహుళ ప్రయోజనార్ధం తెలియజెస్పేటటువంటి ఈ ఫోరమ్ లోకి నూతనంగా అడుగిడుతున్న మరియు ఇప్పటికే రిజిష్టర్ అయి ఉన్న గౌరవ సభ్యులందరికీ మా హృదయ పూర్వక విన్నపం. ఈ ఫోరం మీది. మాది. మనందరిది. సమిష్టిగతంగా ఒక లక్ష్యం ఏర్పరచుకొని సాగుతున్న ఒకానొక సమిష్టిగత ఫోరమ్. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకునే పద్ధతిలో భాగంగా పరిచయం చేసుకొనే విభాగంలో సభ్యులు కేవలం మీయొక్క పేరు, వూరిపేర్లు ఇస్తున్నారు. ఇలా కాదండీ. ఇటువంటి విధానము సభ్యుల మధ్య సరైన సమాచార వ్యవస్థను కల్పించలేము. పరస్పరావగాహన కుదరడం కష్టతరం అవుతుందనే ఉద్ధేశ్యంతో అందరికీ ఉపకరించే, బహుళ ప్రయోజనార్ధం ఒక విధి విధానాన్ని రూపొందించుకుందాం. అందులో మీరు అందరూ పార్టిసిపేట్ చేయగలరు.

మీరు ఇవ్వవలసిన వివరాలు :

మీ పేరు :
మీ ఊరు :
మీ వయస్సు :
మీ పుట్టిన తేదీ :
మీ విద్యార్హతలు :
1) అకడమిక్ విద్యార్హతలు :
2) సాంకేతిక విద్యార్హతలు :
ఏ యే రంగాలపై అభినివేశం ఉన్నది :
ఏ యే విషయాలపై పట్టు ఎక్కువగా ఉన్నది :
మీ ఆసక్తులు లేదా హాబీలు :
మీరు ఈ ఫోరం ద్వారా ఆశిస్తున్న విషయాలు ఏవి :
మీరు ఈ ఫోరం ద్వారా అన్నింటి కంటే ఎక్కువ శాతం ఆశిస్తున్న విషయాలు ఏవి :
మీ చిరునామా :
మీ కమ్యూనికేషన్ కొరకు ఏదేని గుర్తింపు :
మీ ఫోన్ నెంబర్ :
మీ సెల్ ఫోన్ నెంబర్ :
కేటగిరి : (విద్యార్ధులు/ఉద్యోగస్తులు/వ్యాపారస్తులు/గృహస్తులు/సాంకేతిక నిపుణులు/సంఘసేవాతత్పరులు/మంచి మల్టీ పర్పస్ ప్రయోజనాలను సంఘానికి ఇవ్వాలనే ఉద్దేశ్యం కలిగి ఉన్నవారు/ఏదేని సాంకేతిక బ్లాగు ను నిర్వహిస్తున్నవారు/ఏదేని కన్సల్టెంట్ హోదా కలిగి ఉన్న వారు/ఏదేని ఫోరమ్ లలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్న వ్యక్తులు/ఇతరులు (స్పెసిఫిక్ గా తెలియజేయండి)

అవసరమైన విషయాలను గోప్యతా విధానంతో లో ప్రొఫైల్ మొయింటెన్ చేసేవారు అడ్మిన్ అనుమతితో మీకు కావలసినంత వరకు బహిరంగ పరచే విధంగా చేయబడును. వ్యక్తిగతమైన రక్షణకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఈ నియమం పాటిద్దాం. (ఈ విధానం అక్కరలేదు. అయితే కొన్ని అనివార్య పరిస్థితుల దృష్ట్యా తప్పదు)

కొసమెరుపు : ఇటువంటి విధి విధానము ఒక క్రమపద్ధతిలో ఉండటానికి మరియు సౌలభ్యత కొరకు మాత్రమే ఉద్ధేశించినది. మరియు అవసరమైన సందర్భాలలో మీకు అనేక రకాల సౌకర్యాలు కల్పించటంలో, మిమ్ములను త్వరగా సంప్రదించటంగానీ, మీకు అందుబాటులో ఉండటం కోసం మరియు అనేక రకాల బహుళ ప్రయోజనార్ధం సమాచార లభ్యత అవసరమని గమనించ గలరు. దయచేసి అందరూ సహకరించ ప్రార్థన.
ఇట్లు మీ .........మహి గ్రాఫిక్స్ సాంకేతిక బృందం

(విషయంపై మరింత మెరుగైన సూచనలను ఆహ్వానిస్తున్నాము. అందరూ తప్పని సరిగా మీ అభిప్రాయాలు నిర్మొహమాటంగా తెలియజేయండి. మీకు ధన్యవాదాలు.)
Quote this message in a replyReply

Post: #2
Sumanivenkat garu,
మంచి ఉద్ధేశ్యంతో మీరు పడే తపనలో మాఅందరి సహకారం తప్పకుండా ఉంటుంది.నవీన నాగరికంలో వ్యక్తుల మధ్వ వృత్తి పరమైన సంబంధమే తప్ప personal communication అనేది లేకుండా పోయింది.అలాంటిది ఒక సమిష్టితత్వంగల మన ఫోరమ్ లో, సభ్యులందరి మధ్య పరస్పరావగాహన తప్పనిసరి.
ఐతే మనందరి వివరాలు అందించడానికి ఒక ప్రత్యేకమైన పేజి create చేస్తే బాగుంటుందని నా ఉద్ధేశ్యం.ఈ పేజి కొద్దిగా attractiveగా ఉంటే బాగుంటుంది.


ధన్యవాదములు...
Quote this message in a replyReply

Post: #3

    మీరు చేసేప్రయత్నంలొ, మా సాకారం ఉంటుంది, అని మీకు తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. మీ ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని, మాలాంటివారందిరికి, ఉపయోగపడాలని కోరుకుంటున్నాను..

Quote this message in a replyReply

Post: #4
i am new and have to learn more and more about all softwares~~~
Quote this message in a replyReply

Post: #5

సుమణివెంకట్ గారు,

మీరు అడిగిన సమాచారం ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. కాని అవసరమైన విషయాలను గోప్యతా విధానంతో లో ప్రొఫైల్ మొయింటెన్ చేసేవారు అడ్మిన్ అనుమతితో మీకు కావలసినంత వరకు బహిరంగ పరచే విధంగా చేయబడును అన్నారు కాబట్టి ఆసమాచారం ఎక్కడ ఎలా ఇవ్వాలో తెలియజేస్తే మాకు సులువుగా ఉంటుంది

 

రామకృష్ణ

Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)