Post: #1
Evilgrin sorry
Quote this message in a replyReply

Post: #2
మీరు ఫోరంలో లాగిన్‌ అవకుండా ఉంటే సరిపోతుంది.అందుకోసం అకౌంట్‌ రిమూవ్‌ చేయాల్సిన అవసరం లేదు.ఐనా మీ వ్యక్తిగత కారణాల వల్ల ఫోరం నుండి మీ సభ్యత్వాన్ని తొలగించాలనుకుంటే మీరు ఫోరం అడ్మినిస్ట్రేటర్‌కి పర్సనల్‌ మెసేజ్‌ ద్వారా తెలియచేయండి.

*************************************

మీరు ఏ ఫోరం నుండి అకౌంట్‌ డిలీట్‌ చేయాలనుకుంటున్నారూ???

గత కొన్ని మీ పోస్టుల ద్వారా మీరు ఈ ఫోరం నుండి ఆశించిన సమాధానం దొరకక మీరు అకౌంట్ డిలీట్ చేయమని అడుగుతున్నారని గమనించి

ఈ రిప్లై ఇస్తున్నాను.

* ఫోరం అనేది ఒక చర్చా వేదిక,యజమాని (అడ్మినిస్ట్రేటర్) తన వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఫోరంను సృష్టించడు.

* ఫోరం అనేది అందరికి ఉపయోగపడాలనే సదుద్ద్యేశంతో,ఎలాంటి వ్యక్తిగత ఫలితాలను ఆశించక స్థాపిస్తాడు.

* సహజంగా ఒక ఫోరంలో అసంఖ్యాకమైన మెంబర్స్‌ జాయిన్‌ అవుతున్నారంటే ఆ ఫోరంకి ఇంటర్నెట్లో అమితమైన ప్రాచుర్యం లభించడం వలన జరుగుతుంది.ఈ ప్రాచుర్యం అనేది ఆ ఫోరంలో లభించే సమాచారం వల్ల కలుగుతుంది.

* వేల మంది చేరే ఇలాంటి ఫోరం లో పాఠకులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం రకరకాల ప్రశ్నలను పోస్ట్ చేస్తుంటారు.ఇలాంటి కొన్ని వందల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కొంత సమయం పట్టొచ్చు.

* మనం కేవలం ప్రశ్నలను మాత్రమే వేస్తాం!కానీ దానికి సరైన సమాధానాన్ని పాఠకునికి అర్థమైయ్యే రీతిలో అందించడానికి అడ్మిన్‌ ఎంత కష్టపడాలో మనం కాస్త అర్థం చేసుకోవాలి.ఎంత ఫోరం అడ్మినిస్ట్రేటర్‌ ఐనా ప్రతి ప్రశ్నకు తనే సమాధానం ఇస్తాడని ఆశించొద్దు.తనకు కూడా మనలాగే వ్యక్తిగత పనులు,అవసరాలు ఉంటాయి.

* అలా కొన్ని సందర్భాలలో మనకు కావలసిన సమాధానం ఆలస్యం అవొచ్చు.అంతేకాని మన ప్రశ్నలను పట్టించుకోవట్లేదని అభిప్రాయానికి రావొద్దు.

* ఒక బాధ్యతాయుతమైన ఫోరం మెంబర్‌గా మనంకూడా వీలైతే ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించాలి.ఈ ఫోరం నుండి మనమెలా ప్రయోజనం పొందుతున్నామో,అలాగే ఈ ఫోరం అభివృద్ధికి మన వంతు బాధ్యతగా పాటుపడాలి.

ఇది ఫోరం మెంబర్స్‌ అందరూ అర్థం చేసుకోవాలి.మీరుకూడా Smile

*********

చివరగా,

మీరు అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటే అది పర్సనల్‌ మెసేజ్‌ ద్వారా అడ్మినిస్ట్రేటర్‌కు తెలియచేయండి.ఇలా ఓపెన్‌ ఫోరంలో ప్రశ్నిస్తే కొత్తగా చేరే మెంబర్స్

ఆందోళన చెందుతారు.అది ఫోరం ఎదుగుదలకు ఆటంకం కలుగొచ్చు.

ధన్యవాదాలు...

శ్రీనాథ్.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)