Post: #1
Friends

ఈ మధ్య తరచుగా టొరెంట్ ఫైల్ డౌన్ లోడ్ చేస్తున్నసందర్భంలో...
(వివరాలలోకి వెళితే...టొరెంటో ఫైల్ డౌన్ లోడ్ పెట్టిన తరువాత మధ్య మధ్యలో కరెంట్ పోయి మరలా వచ్చిన తరువాత సిస్టమ్ ఆన్ చేసిన తరువాత టొరెంట్ డౌన్ లోడ్ పెట్టే సందర్భంలో...)
మరి కొన్ని ఫైల్స్ భేష్షుగా డౌన్ లోడ్ అవుతున్నాయి కదా...
కొన్ని కావటం లేదు...ఎందుకిలా...?

[Image: 02003236489529699443.png]

Error : Data error (cyclic redundancy check)
అని మెసేజ్ వస్తోంది.
కారణంబేమి..?
పరిష్కార మార్గం ఏమిటో తెలియజేయగలరు...!!
Quote this message in a replyReply

Post: #2
ఈ క్రింది విధంగా ప్రయత్నించి చూడండి.
start>All programs>accessories>command prompt(cmd) ఓపెన్‌ చేసి ఈ క్రింది విధంగా టైప్‌చేసి ఎంటర్‌ కొట్టండి.
chkdsk c: /r

పై కమాండ్‌లో c అని ఉన్న చోట మీరు మీ టొరెంట్‌ ఫైల్స్‌ ఏ ఫోల్డర్‌లో సేవ్‌ చేస్తున్నారో ఆ డ్రైవ్‌లెటర్‌ ఇవ్వండి.
ఎంటర్‌ కొట్టాక Y అని టైప్‌ చేసి ఎంటర్‌ కొట్టండి.ఆ తరువాత cmd నుండి exit అయ్యి సిస్టం రీస్టార్ట్‌ చేయండి.
రీస్టార్ట్‌ అయ్యాక టొరెంట్‌ డౌన్లోడ్‌ స్టార్ట్‌ చేసి చూడండి.

You are not allowed to view links. Register or Login to view.
Quote this message in a replyReply

Post: #3
Sv గారు

మీరు ఏదైతే ఎర్రర్ చూపిస్తుందని చెబుతున్నారో దానికి సంబంధించిన టోరెంట్ పాయింటర్ ఫైల్ పై మరల ఒకసారి డబుల్ క్లిక్ చేసి డౌన్ లోడ్ పాత్ ఇంతకు ముందు ఏదైతే ఇచ్చారో (అంటే ఇంతవరకు డౌన్ లోడ్ అయిన భాగం ఎక్కడ ఉందో ఆ లొకేషన్) ఇవ్వండి. చెకింగ్ చేసుకుని మరల అక్కడనుండి డౌన్ లోడ్ మొదలౌతుంది.
Quote this message in a replyReply

Post Reply 


Forum Jump:


User(s) browsing this thread: 1 Guest(s)